వేసవిలో కూరగాయల జ్యూస్ లను తప్పక తాగాలి.. వీటి తయారీ విధానం ఎలా అంటే?

Published : May 02, 2022, 02:34 PM IST

ఎండ నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కోసం పండ్ల జ్యూస్ లను తీసుకోవడం చేస్తాం.. అయితే పండ్ల జ్యూస్ లతో పాటు తాజా కూరగాయలతో చేసుకునే జ్యూస్ లు (Vegetable juices) కూడా ఆరోగ్యానికి (Health) ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.. మరి వీటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
వేసవిలో కూరగాయల జ్యూస్ లను తప్పక తాగాలి.. వీటి తయారీ విధానం ఎలా అంటే?

తాజా పండ్లలో మాదిరిగానే తాజా కూరగాయలలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. అలాగే వీటిని తీసుకుంటే జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అధిక బరువు సమస్యలను తగ్గిస్తాయి.
 

28

గుండె ఆరోగ్యం (Heart health) కూడా మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించి రోజంతా హుషారుగా ఉండేందుకు ఈ కూరగాయల జ్యూస్ లు సహాయపడుతాయి. సహజసిద్ధమైన పద్ధతులు ఇంటిలోనే తాజాగా చేసుకుని ఈ జ్యూస్ లలో ఎటువంటి రసాయన పదార్థాలు (Chemicals) ఉండవు కనుక ఆరోగ్యానికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి.
 

38

సొరకాయ జ్యూస్: సొరకాయలో నీటి శాతం (Percentage of water) అధికంగా ఉంటుంది. కనుక వేసవిలో తీసుకుంటే శరీరంలోని అధిక వేడిని బయటికి పంపి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  సొరకాయ జ్యూస్  (SoraKaya Juice) తయారీ కోసం సొరకాయ శుభ్రంగా కడిగి పొట్టు, విత్తనాలను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 

48

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో సొరకాయ ముక్కలు పుదీనా, తులసి ఆకులు రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని ఇందులో ఐస్ ముక్కలు (Ice cubes) కలిపి తీసుకోవాలి.
 

58

గుమ్మడి జ్యూస్: గుమ్మడి కాయలో ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి అధిక ఎండ కారణంగా శరీరానికి కలిగే హానిని (Harm) తగ్గిస్తాయి. ఈ జ్యూస్ తయారీ కోసం ముందుగా గుమ్మడి కాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 

68

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గుమ్మడి కాయ ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని ఐస్ ముక్కలు వేసి తీసుకుంటే చల్లచల్లగా భలే రుచిగా (Delicious) ఉంటుంది. వేసవిలో ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి శక్తి (Energy) అంది రోజంతా హుషారుగా ఉంటారు.
 

78

క్యారెట్ జ్యూస్: వేసవి సమస్యలను తగ్గించడానికి క్యారెట్ జ్యూస్ (Carrot Juice) చక్కగా సహాయపడుతుంది. క్యారెట్ లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి గుండె, కడుపు, కంటి, జీర్ణ వ్యవస్థ, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ సౌందర్యం (Skin beauty) కూడా రెట్టింపవుతుంది.
 

88

రెండు క్యారెట్లు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, చిన్న అల్లం ముక్క, పంచదార (Sugar), నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి ఒక గ్లాసులోకి పోసి ఐస్ ముక్కలు పుదీనా ఆకులు (Mint leaves) వేసుకొని తాగితే భలే రుచిగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories