శారీరక, మానసిక ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారం పట్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published : Apr 09, 2022, 03:03 PM IST

ఆరోగ్యమే మహాభాగ్యం.. కనుక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. కానీ ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించడం లేదు.  

PREV
18
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారం పట్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దీంతో ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) వంటి సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. కనుక ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలంటే తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కొన్ని జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తీసుకునే ఆహార జీవనశైలి (Food lifestyle) కీలక పాత్ర పోషిస్తుంది. కనుక తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం మంచిది. పూరీ, దోస లాంటి నూనె పదార్థాలకు (Oil ingredients) బదులుగా ఉదయం ఇడ్లీలను తీసుకోవడం మంచిదని ప్రపంచ దేశాలు ఎన్నో ఆమోదించాయి.
 

38

ఎక్కువ రోజులు ఇడ్లీని తింటే విసుగనిపించినప్పుడు మొలకెత్తిన గింజలలో (Sprouted seeds) కొద్దిగా నిమ్మరసం పిండుకుని తీసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాం. అలాగే పనసకాయ, తోటకూర వంటలను ఎక్కువగా వండుకోవాలి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా (Healthy) ఉంచుతాయి.
 

48

అలాగే రోగనిరోధక శక్తిని (Immunity) పెంచే పండ్లు, కూరగాయలు, గింజలు, తృణ ధాన్యాలు, పప్పులు, నట్స్ లను తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి శక్తినందించి అనేక అనారోగ్య  సమస్యలను (Illness issues) తగ్గించడానికి సహాయపడుతాయి.
 

58

ఉప్పు, పంచదార, మైదా, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మరింత మంచిదని వైద్యులు అంటున్నారు. ఎలాంటి మనస్తత్వాలనైనా, పరిస్థితులనైనా అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
 

68

అయితే సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ మనం ఉద్రేకాలకు లోనైనా,  ఒత్తిడి, ఆందోళన చెందిన వాటి ప్రభావం మెదడు, గుండెపై పడి హైపర్ టెన్షన్ (Hypertension), గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
 

78

కనుక వీలైనంత వరకూ మనస్సును ప్రశాంతంగా (Calm down) ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం (Mental health) బాగుంటుంది. అలాగే ముఖ్యంగా రోజులో ఎక్కువసార్లు నీటిని శరీరానికి అందించాలి. అప్పుడే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు దరిచేరవు.
 

88

రోజూ వ్యాయామం (Exercise), యోగ (Yoga) చేయడం అలవరచుకోవాలి. ఒత్తిడి సమస్యలను తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పుస్తకాలను చదవడం, బొమ్మలు గీయడం, సంగీతం వినడం ఇలా మీకు ఇష్టమైన వాటిని అనుసరించడం మంచిది. ఇలా చేస్తే మనసు తేలికపడి ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఆరోగ్యం మెరుగుపడి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కనుక ఈ జాగ్రత్తలను పాటిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories