వర్షాకాలంలో ఈ కూరగాయలను తప్పకుండా తినాలి.. ఎందుకంటే?

Published : Jul 17, 2023, 04:33 PM IST

కాలాలతో పాటుగా మన డైట్ ను కూడా మార్చుకోవాలంటరు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వానాకాలంలో కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి.  

PREV
16
వర్షాకాలంలో ఈ కూరగాయలను తప్పకుండా తినాలి.. ఎందుకంటే?

వానాకాలంలో రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఫుడ్ ను ఖచ్చితంగా తినాలి.  ముఖ్యంగా కూరగాయలను. వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాల్సిన కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

బీరకాయ

ఈ సీజన్ లో బీరకాయను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సులువుగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా ఇవి ఈ సీజన్ లో పుష్కలంగా లభిస్తాయి. 

36

ఆకుకూరలు

వర్షకాలంలో కొన్ని రకాల ఆకుకూరలకు దూరంగా ఉండాలి. కానీ అమర్నాంత్ వంటి ఆకు కూరలను మాత్రం ఈ సీజన్ లో పుష్కలంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుకూరల్లో ఎముకలను బలంగా ఉంచే పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఆకులను ఆలుగడ్దలతో కలిపి వండి తినొచ్చు.
 

46

బెండకాయ

వర్షాకాలంలో బెండకాయలకు కొదవే ఉండదు. ఈ సీజన్ లో బెండకాయలు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమవుతుంది. నిజానికి బెండకాయ కూరలు ఎంతో టేస్టీగా ఉంటాయి. 

56

బీన్స్

వర్షకాలంలో బీన్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తింటే ఈ సీజన్ లో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి బెండకాయలోకి కీటకాలు వెళ్లవు. ఎందుకంటే ఇవి భూమికి ఆనకుండా చెట్టుకు పైన కాస్తాయి. ఈ చిక్కుళ్లను పులావ్ వంటి ఎన్నో రకాల వంటల్లో వేయొచ్చు. 

66

కాకరకాయ

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్లకు, హార్ట్ పేషెంట్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్లకు కాకరకాయ రసం మంచి మేలు చేస్తుంది. వర్షాకాలంలో కూడా కాకరకాయలు దొరుకుతాయి. కాకరకాయ మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories