అతినిద్ర ప్రమాదకరం.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

24 గంటల్లో మనం ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. తక్కువ గంటలు  నిద్రపోయినా.. ఎక్కువ గంటలు నిద్రపోయినా ఎన్నో సమస్యలు వస్తాయి.
 

why oversleeping is not good for your health rsl
sleeping

రోజులో తక్కువ గంటలు నిద్రపోయినా.. ఎక్కువ గంటలు నిద్రపోయినా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. కానీ ప్రస్తుతం చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నిద్ర సంబంధిత సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది మొత్తమే నిద్రలేకపోవడమైతే.. రెండోది అతిగా నిద్రపోవడం. కానీ ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

why oversleeping is not good for your health rsl
sleeping

రోజులో ఎన్ని గంటలు నిద్రపోవాలి?

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో పరిశోధన ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న వయోజనులు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిదరపోవాలి. ఇన్ని గంటలు నిద్రపోతేనే వీరి శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే ఎలాంటి  అనారోగ్య సమస్యలు రావు. 


sleeping

అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోకపోతే మరుసటి రోజే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలసట, ఒంట్లో శక్తి లేకపోవడం, బద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువగా నిద్రపోవడడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అవసరానికి తగ్గ నిద్రపోకపోయినా. అవసరానికి మించి నిద్రపోయినా ఎన్నో రోగాలు వస్తాయి. అతిగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయంటే? 

sleeping

నార్కోలెప్సీ

నార్కోలెప్సీ ఒక నిద్ర రుగ్మత. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు పగటిపూటే ఎక్కువ నిద్రపోతారరు. అలాగే అకస్మత్తుగా నిద్ర పోతారు. ప్రయాణాల్లో కూడా. ఇది డేంజర్ వ్యాధి.
 

స్లీప్ అప్నియా

ఇది శ్వాసపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోతుంది. ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మత. ఈ సమస్య ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తుంది. ఊబకాయం వంటి కారకాల వల్ల ఈ సమస్య వస్తుంది. 

ఇడియోపతిక్ హైపర్సోమ్నియా

ఇడియోపతికక్ హైపర్సోమ్నియా ఉన్నవారు రోజువారి పనులను చేసినా బాగా అలసిపోయినట్టుగా భావిస్తారు. దీనివల్ల రోజువారి పనులను కూడా చేయడానికి ఇష్టపడరు. అలాగే ఒంటి నొప్పులు, తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడతారు.

Latest Videos

vuukle one pixel image
click me!