వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.. పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Published : Jul 06, 2023, 03:50 PM IST

వానలు, చల్లని గాలులు మన శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో మీ రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.   

PREV
18
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.. పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రుతుపవనాల రాకతో వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ సీజన్ లో దగ్గు, జలుబు, ఫంగల్ ఇన్ఫెక్షన్ లతో పాటుగా ఎన్నో రోగాలు కూడా వస్తుంటాయి. వర్షాల రకాతో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది. అందుకే దీన్ని జలుబు, దగ్గు సీజన్ గా పరిగణిస్తారు. దీనికి కారణం రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటమే. ముందుగా వర్షాకాలం మన రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. దీంతో దీన్ని బలంగా ఉంచే చిట్కాలను ఫాలో కావొచ్చు.
 

28
Image: Getty

సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది

జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ ప్రకారం.. వర్షాకాలంలో ఎన్నో కారణాల వల్ల మన రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. వాతావరణంలో తేమ పెరగడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు సులభంగా అభివృద్ధి చెందుతాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

38

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రోడ్ల చుట్టూ పేరుకుపోయిన నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియాకు వాహకాలు. ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు విపరీతమైన జ్వరం, చలి, కండరాల బలహీనత, నొప్పిని కలిగిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ చెడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వ్యాధులు, అంటువ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ వలయంగా పనిచేస్తుంది. అందుకే ఈ సీజన్ లో మీ రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

48
immunity

శాకాహారం 

మొక్కల ఆధారిత ఆహారాల్లో పోషకాలు, ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆహారాలలో ఉండే ఫైబర్ కడుపులోని మంచి బ్యాక్టీరియాకు పోషణను అందిస్తుంది. మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఫైబర్ ఎక్కువగా ఉండే బచ్చలికూర, బ్రోకలీ, అల్లిసిన్ ఎక్కువగా ఉండే వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చండి.
 

58

ఆరోగ్యకరమైన కొవ్వులు 

శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, విటమిన్లను గ్రహించడానికి, హృదయ సంబంధ సమస్యలను నివారించడానికి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా చాలా అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు వ్యాధికారక క్రిములకు శరీరం రోగనిరోధక ప్రతిస్పందనను కూడా పెంచుతాయి. వర్షాకాలంలో కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులను మీ ఆహారంలో చేర్చండి. ఈ కొవ్వుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండెకు చాలా మంచివి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్, అవోకాడో ఆయిల్, బాదం, వేరుశెనగ, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ను తీసుకోండి. పొద్దుతిరుగుడు, నువ్వులు, గుమ్మడికాయ విత్తనాలు, వాల్ నట్స్, కొవ్వు చేపలు, సోయా పాలు పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులకు వనరులు.
 

68
immunity boosting foods

పులియబెట్టిన ఆహారం 

నేచర్ జర్నల్ ప్రకారం.. పులియబెట్టిన ఆహారాలు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు కూడా సహాయపడతాయి. రోజూ ఒక చిన్న కప్పు పెరుగును మీ డైట్ లో చేర్చుకోండి.
 

78

కృత్రిమ చక్కెరకు దూరం

బరువు పెరగడానికి, ఊబకాయానికి ప్రధాన కారణం చక్కెరను ఎక్కువగా తీసుకోవడమే. అందుకే రోజుకు రెండు టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోకూడదు. చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే బరువు , మంట తగ్గుతుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పంచదారకు బదులుగా తేనెను వాడటం మంచిది. 
 

88

ప్రతిరోజూ వ్యాయామం 

మితమైన వ్యాయామం రోగనిరోధక కణాలను క్రమం తప్పకుండా పునరుత్పత్తి చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ఇందుకోసం బ్రిస్క్ వాకింగ్ లేదా లైట్ జాగింగ్ లేదా స్కిప్పింగ్ కూడా చేయొచ్చు. అయితే మీ శరీరానికి సరిపోయే వ్యాయామాలను చేయండి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి యోగాసనాలను కూడా చేయొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. బరువును అదుపులో ఉంటుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఒక వ్యక్తి వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. అంతేకాదు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి వాటర్ ను తాగాలి. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories