Health Tips: ఈ లక్షణాలు ఉంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Published : Jul 06, 2023, 01:39 PM IST

Health Tips: రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తున్న వ్యాధి. దీని గురించి ఒక అవగాహనకు వచ్చే సమయానికి పరిస్థితి మన చేతుల్లో లేకుండా పోతుంది. అందుకే ఒక అవగాహన కోసమే ఈ వ్యాసం.  

PREV
16
Health Tips: ఈ లక్షణాలు ఉంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

రొమ్ము క్యాన్సర్ అనేది స్త్రీ పురుషులకి వచ్చే వ్యాధి అయినప్పటికీ ఈ వ్యాధికి ఎక్కువగా స్త్రీలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చికిత్స విధానంలో వచ్చిన మార్పుల వల్ల మునుపటికన్నా ఈ వ్యాధిని నిర్ధారించడం నివారించడం సులభతరమైంది.

26

అందుకే రొమ్ము క్యాన్సర్ మనుగడ రేటు మెరుగుపడింది మరియు వ్యాధికి సంబంధించిన మరణాల సంఖ్య కూడా వేగంగా తగ్గుతుంది. ముందు రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గురించి చూద్దాం. రొమ్ముల వాపు, చర్మం ముడతలు, రొమ్ము చనుమోన లోపలికి తిరిగిపోవడం, రొమ్ములోని అసలు కనికి స్పష్టంగా కనిపించక ముందే..

36

కాలర్ బోన్ చుట్టూ లేదా చేయి కింద సోష రస కణుపులు గుబ్బటం రొమ్ము క్యాన్సర్ని సూచిస్తుంది. ఈ క్యాన్సర్ ఐదు నుంచి పది శాతం వరకు వంశపారంపర్యం కారణంగా వస్తుంది. మరియు మీరు ఉండే పరిసరాలు అక్కడ ఉండే కాలుష్యము, చిన్నతనంలోనే రేడియేషన్ కి గురికావడం.

46

మద్యం సేవించడం, పెరుగుతున్న వయస్సు,12 ఏళ్ల లోపు రుతు స్రావం ప్రారంభం అవటం మొదలైనవి రొమ్ము క్యాన్సర్ కి కారణాలు. కాబట్టి అవగాహన పెంచుకోవడానికి రూముని స్వీయ పరీక్ష చేసుకోండి. ఆల్కహాల్ వినియోగాన్ని నియంత్రించండి. అలాగే 47 పైబడిన మహిళలు తరచుగా మెమోగ్రామ్లను కలిగి ఉండాలని సలహా ఇస్తారు.

56

ఇది రొమ్ము కణజాలంలో మార్పులని చూడటానికి తక్కువ మోతాదు ఎక్స్ కిరణాలను ఉపయోగించే ప్రక్రియ. ఏదైనా సందర్భంలో నొప్పి లేదా గడ్డ ఏర్పడినట్లయితే వెంటనే వైద్యులని సంప్రదించండి అలాగే శరీర బరువుని కూడా నియంత్రణలో ఉంచుకోండి రోజు తగిన వ్యాయామం చేయండి.

66

నివారించడానికి తల్లి పాలు ఉత్తమ మార్గం అలాగే తల్లిపాలు బిడ్డకు మంచిది పాలిచ్చే ప్రతి మహిళకు మేలు జరుగుతుందని తెలుసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంవత్సరానికి ఒకసారి రొమ్ముకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ క్యాన్సర్ లేని జీవితాన్ని గడపండి.

click me!

Recommended Stories