కొత్తిమీర, పుదీనా ఆకులను మనం వివిధ కూరల్లో ఉపయోగిస్తుంటాం. నిజానికి ఈ రెండూ మంచి వాసనను కలిగి ఉంటాయి. అలాగే ఫుడ్స్ ను ఎంతో టేస్టీగా చేస్తాయి. అందుకే వీటిని పానీయాలు, సలాడ్లు, రుచికరమైన వంటల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. పుదీనాను ఎసెన్షియల్ ఆయిల్, మెంతోల్ మౌత్ ఫ్రెష్నర్లు, పానీయాలు, యాంటీసెప్టిక్ మౌత్ వాష్ లు, టూత్ పేస్ట్, చూయింగ్ గమ్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.