బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం చాలామంది రోజు టాబ్లెట్లు వేసుకుంటారు. అయితే వెల్లుల్లి వాడటం ద్వారా కూడా బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంటున్నారు వైద్యులు. దీనిలో అల్లిసిన్, డయాలిల్ డై సల్ఫైడ్, డయాలిల్ ట్రై సల్ఫయిడ్, సల్ఫర్ సమ్మేళనాలు, ఖనిజాలు.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ని నియంత్రించడంలో అల్లిసిన్ పదార్థం ఎక్కువగా ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లి ముక్కలుగా కోసినప్పుడు లేదా తినడం ద్వారా అలీనాజ్ విడుదలవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల అనేక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి కూరల్లో, టీ లో కూడా ఉపయోగించుకోవచ్చు. సలాడ్స్ లో తరిగిన వెల్లుల్లిని ఉపయోగించుకోవచ్చు.
దీనివలన అదనపు రుచి యాడ్ అవటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. సలాడ్స్ కోసం ప్రత్యేకంగా సాల్టెడ్ వెల్లుల్లి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా పులియపెట్టిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ తో పాటు ఇతర సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
వెల్లుల్లి టీ తాగడం ద్వారా కూడా బీపీకి చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి టీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాస్త నీరు మరగబెట్టి అందులో తరిగిన వెల్లుల్లిని చేర్చాలి. మళ్ళీ ఐదు నిమిషాలు మరిగిన తర్వాత వడకట్టాలి. అందులో రుచి కోసం కాస్త తేనెను కలుపుకుంటే సరిపోతుంది.
అలాగే వెల్లుల్లి పొడి చేసుకొని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. రోజు 600 నుంచి 900 మిల్లీగ్రాముల వరకు వెల్లుల్లి పొడిని తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ని తొమ్మిది నుంచి 12 శాతం తగ్గించవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.