ఆడవాళ్ళకి నెలసరి సమయం అనేది ఎంతో చికాకు పరిచే విషయం అయినా తప్పించుకోలేని ప్రక్రియ ఇది. చాలామంది నెలసరి సమయంలో బయటికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ వారి నుంచి దుర్వాసన వస్తుందో అనుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు.
దానికి తోడు యోని వాసనను పెర్ఫ్యూమ్ తో మరియు క్లీన్జర్లతో సరిదిద్దాలి అంటూ వస్తున్న యాడ్స్ ని చూసి మరింత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దీనితో సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడటం ప్రారంభిస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమంటే యోని అనేది స్వీయ శుభ్రపరిచే అవయవం.
దానిని శుభ్రంగా ఉంచడానికి ఉత్పత్తుల సహాయం అవసరం లేదు. సానిటరీ పాడ్స్ ను నాలుగు గంటలకి ఒకసారి మార్చడం వలన ఎలాంటి దుర్వాసన రాదు. అంతేకానీ ఈ సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడితే అవి తేమని పీల్చుకొని పొడిగా ఉండే శాసకపదార్థాలతో తయారుచేస్తారు.
కాబట్టి యోని ప్రాంతంలో తేమ ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు రావచ్చు. సెంటెడ్ సానిటరీ పాడ్స్ ని కెమికల్స్ తో తయారు చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ కెమికల్ సువాసనలు సున్నితమైన చర్మాన్ని చికాకు పెడతాయి.
అందులో వాడే హైడ్రో కార్బన్లు క్యాన్సర్ కారకంగా కూడా ఉండవచ్చు. రుతుప్రవాహం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు సానిటరీ ప్యాడ్స్ మార్చుతూ ఉండండి. యోని ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి సున్నితమైన సబ్బులు వాడండి.
బిగుతుగా ఉండే లెగ్గింగ్స్, జగ్గింగ్స్, సింథటిక్ లో దుస్తులు వాడకండి. పీరియడ్స్ లో దుర్వాసన వస్తుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా ఎస్టిఐగా అనుమానించి వైద్యుల వద్దకు వెళ్ళండి. రోజుకి రెండుసార్లు స్నానం చేయడం ఉత్తమం.