Health Tips: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల కళ్ళు స్ట్రైన్ అవుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Published : Sep 16, 2023, 10:55 AM IST

Health Tips: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి వచ్చేసింది. దానివల్ల కళ్ళు ఎంతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.  

PREV
16
Health Tips: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల కళ్ళు స్ట్రైన్ అవుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

 నేటి ఆధునిక ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకుండా చదువులు కానీ ఉద్యోగాలు కానీ నెట్టుకురాలేని పరిస్థితి వచ్చింది. కొందరు ఈ గాడ్జెట్స్ ని సరదాల కోసం ఉపయోగిస్తే కొందరు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆ ఒత్తిడి కళ్ళ మీద పడుతుంది.
 

26

 దీనివలన మనం అనేక సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది. కళ్ళు దురద పెట్టడం, కళ్ళు డ్రై అయిపోవడం, కంటి నొప్పి, కంటి నుంచి నీరు కారడం, కళ్ళు మసకబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడటం వల్లే వస్తుంది.
 

36

అలా అని వాటిని పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు. అది ఎలాగో చూద్దాం. కంప్యూటర్ ని వాడేటప్పుడు.
 

46

 మీ కళ్ళకి ఎదురుగా ఉండే ఎత్తులో గాడ్జెట్  పెట్టుకొని వాడటం వల్ల కంటికి ఒత్తిడి  ఎక్కువగా ఉండదు. అలాగే ప్రతి గంటకి ఒక ఐదు నిమిషాల పాటు కంప్యూటర్ ముందు నుంచి లేచి చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూస్తూ ఉండండి. అది కంటికి రిలాక్సేషన్ ని ఇస్తుంది.
 

56

అలాగే కంటికి ఒత్తిడిగా  అనిపించినప్పుడు కంటిమీద కీర లేదా బంగాళదుంప స్లైసెస్ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వండి. అది కంటికి మంచి విశ్రాంతిని ఇస్తుంది. అలాగే ఒంటికి వ్యాయామం ఎంత అవసరమో కంటికి కూడా వ్యాయామం అంతే అవసరం.

66

ఐ బాల్ ని ఒక్క దగ్గరే  నిలబెట్టకుండా చుట్టూ చూడటం, ఐ బాల్ ని గుండ్రంగా తిప్పడం, కంటి ఎదురుగా పెన్సిల్ పెట్టుకొని కాన్సన్ట్రేట్ చేసి చూడటం వంటివి కంటికి మంచి ఎక్సర్సైజ్. దీనితో పాటు మంచినీరు కూడా ఎక్కువగా త్రాగుతూ ఉంటే కంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

click me!

Recommended Stories