పీరియడ్స్ ఒక సాధారణ ప్రక్రియ. అయితే కొంతమందికి ఈ పీరియడ్స్ సక్రమంగా రావు. దీంతో ఎంతో కంగారు పడిపోతుంటారు. పీరియడ్స్ మిస్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రెగ్నెన్సీ. గర్భం దాల్చితే పీరియడ్స్ రావు. ప్రెగ్నెన్సీతో పాటుగా మరికొన్ని కారణాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి. ఇది మీ శరీరంలో ఎన్నో మార్పులను కలిగిస్తుంది.
పీరియడ్స్ మిస్ కావడం ఎంత కాలం సాధారణం?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 21-30 రోజుల పీరియడ్ చక్రం సాధారణం. కానీ 6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకపోతే మీ పీరియడ్స్ మిస్ అయ్యాయని అర్థం. మరి పీరియడ్స్ మిస్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి
ప్రస్తుత కాలంలో ఒత్తిడితో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఈ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఒత్తిడి వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని వల్ల మీ పీరియడ్స్ సమయానికి రావు. అలాగే పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిరి సమస్యలు కూడా వస్తాయి.
ఊబకాయం
ఊబకాయం కూడా పీరియడ్స్ మిస్ కావడానికి ఒక కారణం కావొచ్చు. బరువు ఎక్కువున్న ఆడవారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పీరియడ్స్ పై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
periods
బరువు తగ్గడం
ఉండాల్సిన బరువు కంటే మరీ తక్కువగా ఉన్నవారికి కూడా తరచుగా పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. మీరు శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటే, మీ బరువు వేగంగా తగ్గుతుంటే మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యంగా ఉంటాయి. దీంతో మీరు పీరియడ్స్ ను మిస్ అవుతుంటారు.
జనన నియంత్రణ మందులు
గర్భధారణను నివారించడానికి చాలా మంది ఆడవారు ఎక్కువగా గర్భనిరోధక మందులను వాడుతుంటారు. కానీ వీటిని ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అలాగే చాలాసార్లు పీరియడ్స్ కూడా మిస్ అవుతాయి.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ ఉన్న మహిళలకు కూడా పీరియడ్స్ మిస్ అయ్యే సమస్య వస్తుంది. వీరిలో ఆండ్రోజెన్ స్థాయి పెరుగుతుంది. కొన్నిసార్లు అండాశయం తిత్తిగా కూడా మారుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రావు.