పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం

Published : Jun 16, 2023, 12:58 PM IST

నెలసరి నొప్పి, తిమ్మిరి చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. కానీ ఈ సమస్యలు రోజు వారి పనులను చేయనీయవు. కానీ కొన్ని సాధారణ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.   

PREV
16
పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం
periods pain

పీరియడ్స్ ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఇది కొంతమందిలో మూడ్ స్వింగ్స్, ఆహార కోరికలు, పొత్తి కడుపులో నొప్పి, ఇతర భాగాలలో నొప్పిని, తిమ్మిరిని కలిగిస్తుంది. నెలసరి వల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేరు. గర్భాశయ గోడల కండరాల సంకోచం కారణంగా ఆక్సిజన్ గర్భాశయ కణజాలానికి చేరుకోలేకపోవడం వల్ల పీరియడ్స్ తిమ్మిరి (డిస్మెనోరియా) వస్తుంది. పీరియడ్స్ కు ముందు లేదా ఆ సమయంలో సంభవించే గర్భాశయ సంకోచాల వల్ల తిమ్మిరి వస్తుంది. ఇది వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉండొచ్చు. కొంతమంది మహిళలకు విపరీతమైన నొప్పి వస్తుంది. మరికొందరికి ఇది తేలికపాటిదిగా వస్తుంది. అయితే  ఈ నొప్పిని కొన్ని ఇంటి చిట్కాలతో సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..

26

cinnamon tea

అల్లం లేదా దాల్చిన చెక్క టీ తాగండి 

పీరియడ్స్ వల్ల కొంతమందికి భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పిని నేచురల్ గా తగ్గించుకోవడం మంచిది. అల్లం టీ, దాల్చిన చెక్క టీ లు మూలికా టీలు. ఇవి పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లం టీ నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థంగా పనిచేస్తుంది. దాల్చినచెక్క టీలో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రుతుక్రమ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
 

36

నెయ్యి

పీరియడ్స్ సమయంలో మీరు తినే ప్రతి భోజనంలో ఒక టీస్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెయ్యి నెలసరిలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

46

విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం

విటమిన్ డి నెలసరి నొప్పిని, తిమ్మిరిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే నెలసరి సమయంలో విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. 
 

 

56

హైడ్రేట్ గా ఉండండి

చాలా మంది పీరియడ్ సమయంలో నీటిని అస్సలు తాగరు. నిజానికి బాడీ డీహైడ్రేట్ అయితే నొప్పి, తిమ్మిరి ఇంకా ఎక్కువ అవుతాయి. అంతేకాదు కడుపు ఉబ్బరం సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలు రాకూడదంటే నీళ్లను పుష్కలంగా తాగుతూ ఉండండి. 

66
banana

అరటిపండు 

అరటిపండ్లలో విటమిన్ బి 6, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉబ్బరం, తిమ్మిరి సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories