ఈ కూరగాయలు కొవ్వును కరిగిస్తయ్.. రోజూ తినండి

Published : Jun 16, 2023, 12:10 PM IST

కొన్ని కూరగాయలు పోషకాల బాంఢాగారం. వీటిని తింటే మన  శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.   

PREV
19
 ఈ కూరగాయలు కొవ్వును కరిగిస్తయ్.. రోజూ తినండి
vegetables

బరువు పెరిగినంత ఈజీ కాదు తగ్గడం. దీనికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇందుకోసం శారీరక వ్యాయామం నుంచి జీవన శైలి అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇలాంటప్పుడు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. ద్రవాలతో పాటుగా శరీరానికి హైడ్రేటింగ్, శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడే ఆహారాలను కూడా తీసుకోవాలి. బరువు తగ్గడానికి విటమిన్లు, ప్రోటీన్ లేదా ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అయితే అదనపు కొవ్వును కరిగించడానికి కొన్ని కూరగాయలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 

29

సొరకాయ:- సొరకాయను చాలా మంది తినరు. ఇది అంత టేస్టీగా ఉండదని. కానీ సొరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయంలో ఏంటంటే.. దీనిలో కొవ్వు మొత్తమే ఉండదు. ఇకపోతే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
 

39
Image: Getty Images

కీరదోసకాయ:- కీరదోసకాయను ఎండాకాలంలో తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయలో 96% వాటర్ కంటెంట్ ఉంటుంది. మిగిలినది ఫైబర్ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. వీటితో పాటుగా కీరదోసకాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
 

49
Image: Getty Images

క్యాప్సికమ్ :- క్యాప్సికమ్ మసాలా టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరగాయ మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కొవ్వును తగ్గిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుంది.
 

59

బెండకాయ:- బెండకాయ కూడా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. బెండకాయలో కరిగే, కరగని ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. బెండకాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిస్, హార్ట్ పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

69

ఆకుకూరలు:- బ్రొకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే మొదలైన ఆకుపచ్చ కూరగాయల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఎక్కువగా ఉండే పోషకాలు ఎండాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. 
 

79

కాకరకాయ:- కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది దీన్ని అస్సలు తినరు. కానీ ఈ కూరగాయలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. కాకరకాయను తింటే కొవ్వు కణాలు చనిపోతాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఈ కూరగాయను ఖచ్చితంగా తినండి. 
 

89

టొమాటో:- టమాటాలో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. టమోటాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

99

క్యారెట్ :- క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్ కూడా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యారెట్ లో విటమిన్ ఎ, ఫైబర్ కూడా ఉంటాయి. క్యారెట్ త్వరగా జీర్ణం కాకుండా మీ ఆకలిని దూరం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories