గోరువెచ్చని నీటిని తాగితే బరువు తగ్గడమే కాదు.. మరెన్నో లాభాలను పొందుతారు.. గోరువెచ్చని నీరే ఎందుకు బెస్ట్ అంటే

First Published | Sep 12, 2023, 10:38 AM IST

చలికాలమైనా, ఎండాకాలమైనా గోరువెచ్చని నీటిని తాగడమే బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే గోరువెచ్చని నీరు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 

శారీరక శ్రమలో పాల్గొనప్పుడు లేదా వేడిగా అనిపించినప్పుడు చల్లని నీటిని తాగాలనిపిస్తుంది. కానీ చల్ల నీళ్ల కంటే గోరువెచ్చని నీళ్లే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోరువెచ్చని నీటిని తాగితే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. అంతేకాదు గోరువెచ్చని నీరు ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఉదయాన్నే లేచి పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తగ్గుతుంది. 
 

చల్లటి నీరు వర్సెస్ గోరువెచ్చని నీరు

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే.. అయితే చల్లని నీరు ఆరోగ్యానికి చాలా హానికరమని పరిశోధనలు నిరూపించలేదు. చల్లని, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీరు లేదా గోరువెచ్చని నీరు ఈ మూడూ మనల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Latest Videos


చల్లటి నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చల్లని నీటిని తాగడం వల్ల  శ్లేష్మం చిక్కగా మారుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే తలనొప్పి, జలుబు, దంతాల సున్నితత్వం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది అచలాసియాకు దారితీస్తుంది. ఇది అరుదైన వ్యాధి. ఇది అన్నవాహిక నుంచి కడుపునకు ఆహారాన్ని తీసుకెళ్లడం కష్టతరం చేస్తుంది. అంతేకాదు చల్ల నీటిని తాగితే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలాగే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, తిమ్మిరి, మలబద్దకం వంటి సమస్యలకు దారితీస్తుంది. 

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చురుకైన జీవక్రియ 
 
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరిగినప్పుడు మన జీవక్రియ వ్యవస్థ కూడా మరింత చురుగ్గా మారుతుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

బరువు తగ్గొచ్చు 

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం యాక్టివేట్ అవుతుంది. ఇది రోజంతా ఎక్కువ కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పేగు శుభ్రపడుతుంది. ఇది శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే ఈ వ్యర్థాలు మన శరీరంలో ఉబ్బరం, నీటి నిలుపుదలకి కారణమవుతాయి.
 

warm water

జీర్ణ వ్యవస్థ రుగ్మతలు 

సాధారణంగా పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు మలబద్దకం, కడుపునొప్పిని కలిగిస్తాయి. అయితే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల పేగు సంకోచాల ప్రక్రియ ఫాస్ట్  అవుతుంది. అంతేకాదు ఇది మన జీర్ణవ్యవస్థ చురుగ్గా కూడా ఉంచుతుంది. ఈ నీరు మన జీర్ణవ్యవస్థలోని అవయవాలకు నీటి లూబ్రికేట్ గా పనిచేస్తుంది. ఇది హైడ్రేట్ చేయడానికి, విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
 

టాక్సిన్స్ బయటకు 

గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఎండోక్రైన్ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అలాగే శరీరం సులువుగా చెమట పడుతుంది. గోరువెచ్చని నీటిని తాగితే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
 

నోటి ఆరోగ్యానికి మంచిది

సున్నితమైన దంతాలున్నవారు, కావిటీస్ సమస్య ఉన్నవారు చల్ల నీటిని తాగకూడదు. ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. చల్లనీటిని తాగితే దంతాలు దెబ్బతింటాయి. అయితే గోరువెచ్చని నీటిని తాగితే సున్నితమైన దంతాలకు ఉపశమనం కలుగుతుంది. 

click me!