వీర్యం తక్కువగా ఉంటే క్యాన్సర్ వస్తుందా?

First Published Mar 1, 2024, 10:44 AM IST

ఈ రోజుల్లో సంతానలేమి మగవారిలో ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా లేదా మొత్తమే లేని మగవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఓ తాజా అధ్యయనం కనుగొంది. 

మనం తినే ఫుడ్, మనం ఏం పనులు చేస్తున్నాం అనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అలవాట్లు మెరుగ్గా లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మీరు తినే ఫుడ్ ప్రభావం మీ సంతానోత్పత్తిపై కూడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనివల్ల సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై ఓ అధ్యయనం కూడా షాక్ అయ్యే విషయాలను కనుగొంది. ఈ అధ్యయనంలో.. స్పెర్మ్ కౌంట్ తక్కువగా లేదా  మొత్తమే లేని పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు.
 

sperm

అజియోస్పెర్మిక్ లేదా స్పెర్మ్ లేని పురుషులకు ఎముక, కీళ్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 156 శాతం పెరిగింది. అలాగే శోషరస, మృదు కణజాలం, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60, 56, 54 శాతం పెరిగింది. ఈ పరిశోధనలో చేసిన పరిశోధకుల ప్రకారం..  సంతానోత్పత్తి తక్కువగా ఉన్న పురుషుల కుటుంబాలలో క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉన్న ఎన్నో నమూనాలను కనుగొనబడ్డాయి.


అధ్యయనం ఏం చెబుతోంది?

మిల్లీ లీటర్ వీర్యంలో 1.5 మిలియన్ల కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న మగవారికి ఎముక, కీళ్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 143 శాతం, వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 134 శాతం ఉందని ఉటా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో కనుగొన్నారు. వృషణ క్యాన్సర్ మగవారిలో సర్వసాధారణం. అలాగే తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న మగవారికి ఈ రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వీటికి తోడు తక్కువ స్పెర్మ్ కౌంట్.. ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్లను కూడా కలిగిస్తుందని కనుగొన్నారు. 
 

ఒలిగోస్పెర్మియా అంటే ఏంటి ?

తక్కువ స్పెర్మ్ కౌంట్ ను ఒలిగోస్పెర్మియా అని కూడా అంటారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 16 మిలియన్ / ఎంఎల్ కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ ను.. తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా ఒలిగో స్పెర్మియా అంటారు. వెరికోసెల్ అంటే వృషణంలోని విస్తరించిన సిరలు, హార్మోన్ల అసమతుల్యత, స్మోకింగ్, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వాడకం, ఊబకాయం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్స లేదా సంక్రమణ, మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడకం బాగా పెరగడం వల్ల ఒలిగోస్పెర్మియా వస్తుంది. 

ఒలిగోస్పెర్మియా  లక్షణాలు

దీన్ని గుర్తించడానికి లక్షణాలు పెద్దగా ఏం కనిపించవు. కానీ స్ఖలనం సమయంలో.. వీర్యం తక్కువగా ఉండటం, మొత్తమే లేకపోవడం, వీర్యం వాటర్ లా ఉండటం, వృషణంలో నొప్పి లేదా వాపు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పురుషులలో రొమ్ము కణజాల విస్తరణ, గైనెకోమాస్టియా అని పిలువబడే కొన్ని సంకేతాలు ఒలిగోస్పెర్మియాను సూచిస్తాయి.
 

ఒలిగోస్పెర్మియా, క్యాన్సర్

తక్కువ స్పెర్మ్ కౌంట్ నేరుగా క్యాన్సర్ కు కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ దీన్ని ఒక సూచనగా భావించాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒలిగోస్పెర్మియాను హార్మోన్ల చికిత్స, వెరికోసెల్ మరమ్మత్తు వంటి శస్త్రచికిత్స , ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో దీన్ని తగ్గించుకోవచ్చు. 

click me!