చలికాలంలో అన్ని రకాల పండ్లను తినొద్దు.. వీటిని మాత్రమే తినాలి

First Published | Dec 4, 2024, 10:30 AM IST

కాలంతో పాటుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పండ్లు మన ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. ఈ సీజన్ లో అన్ని రకాల పండ్లను మాత్రం తినొద్దు. అందుకే ఈ సీజన్ లో తినాల్సిన పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

fruits

ఈ చల్లని వాతావరణం బాగా అనిపించినా.. ఈ సీజన్ లో మనం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ వాతావరణం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ  సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, మోకాళ్ల నొప్పులు, దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి, మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. 

Fruits

మనం ఈ జబ్బులకు దూరంగా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మందులు, మాత్రమే వేసుకోకున్న ఆరోగ్యం బాగుండాలంటే మన శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను ఖచ్చితంగా తినాలి.

 పండ్లు మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. అయితే చలికాలంలో మాత్రం కొన్నిరకాల పండ్లను తినకపోవడమే  మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చలికాలంలో తినాల్సిన పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


చలికాలంలో తినాల్సిన పండ్లు

దానిమ్మ

దానిమ్మ పండ్లు కాలాలతో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. అయితే ఈ పండ్లను మనం ఏ కాలంలోనైనా తినొచ్చు. కానీ చలికాలంలో మాత్రం ఖచ్చితంగా ఈ పండ్లను తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే దానిమ్మ పండులో రకరకాల విటమిన్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఈ పండ్లను అలాగే లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. దానిమ్మ పండును తింటే బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. 

కివి పండ్లు

కివి పండ్లు కూడా చలికాలంలో బాగా దొరుకుతాయి. ఈ పండ్లను కూడా ఖచ్చితంగా చలికాలంలో తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ పండ్లు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

కివి పండ్లలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. అలాగే చల్ల గాలి వల్ల చర్మం పొడిబారితే దానిని నయం చేయడానికి ఈ పండు సహాయపడుతుంది. 

black grapes

నల్ల ద్రాక్ష

వానాకాలం, చలికాలంలో జీర్ణ సమస్యలు చాలా కామన్. లిమిట్ లో తిన్నా కానీ ఈ సీజన్ లో మెటబాలిజం సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రావొద్దంలే చలికలంలో నల్ల ద్రాక్షలను తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. 
 

strawberries

స్ట్రాబెర్రీలు

చలికాలంలో సీజనల్ కూరగాయలను, పండ్లను ఖచ్చితంగా తినాలి. ఇలాంటివాటిలో స్ట్రాబెర్రీలు ఒకటి. చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీరు ఎన్నో లాభాలను పొందుతారు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి.

ఇవి మన  రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. చలికాలంలో ఈ పండ్లతో పాటుగా పుచ్చకాయ, నారింజ, నిమ్మ, జామ వంటి పండ్లను కూడా తినాలి. ఎందుకంటే ఈ పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. 

Latest Videos

click me!