జాగ్రత్త నిద్రపోకపోతే ఈ రోగాలొస్తయ్..

First Published | Dec 24, 2023, 2:10 PM IST

కొవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజల నిద్ర అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయని ఎన్నో నివేదికలు వెల్లడించాయి. కంటినిండా నిద్రపోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. నిజమేంటంటే.. మనలో చాలా మంది నిద్రకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వయోజనులకు ప్రతి రాత్రి కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది చాలా తక్కువ సమయమే నిద్రపోతున్నారు. దీనికితోడు మితిమీరిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకం కూడా ప్రజల నిద్ర అలవాట్లను ఎంతో ప్రభావితం చేసింది. అసలు కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆలోచనా సామర్థ్యం..

రాత్రిపూట రోజూ 7-8 గంటలు నిద్రపోకపోతే మన మెదడుపై ప్రభావం పడుతుంది. అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం, శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మీరు రాత్రిపూట నిద్రపోవడానికి, ఉదయం నిద్రలేవడానికి ఇబ్బందిని కలిగిస్తుంది. 
 

Latest Videos


మానసిక ఆరోగ్య సమస్యలు

ఇది మెదడును ప్రభావితం చేస్తుందని చెప్పినప్పుడు..మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని స్పష్టమవుతుంది. నిద్రలేమి కారణంగా మూడ్ ఇష్యూస్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

ఇమ్యూనిటీ తగ్గడం

నిద్ర లేకపోవడం వల్ల కూడా మన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారినప్పుడు.. మనం తరచుగా ఎన్నో రకాల వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడతాం.
 

lack of sleep

బరువు పెరగడం

రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. ఇది శరీర పనితీరులో వివిధ మార్పులకు దారితీస్తుంది. రాత్రిపూట మెలుకువగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తిని ఇలా బరువు పెరిగిపోతారు. అలాగే జీవక్రియ కూడా పనిచేయకపోవడం వల్ల బరువు పెరుగుతారు.
 

హార్మోన్ల మార్పులు

నిద్రకు భంగం కలిగితే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. హార్మోన్ల మార్పులు శరీరాన్ని, మనస్సును ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. ఇది ఆకలి, ఒత్తిడి, ఆనందం, నిరాశ, కోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. 

చర్మ సమస్యలు

క్రమం తప్పకుండా సరిగా నిద్రపోని వారికి చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేకపోవడం వల్ల ముఖంపై నల్లటి వలయాలు, డల్ చర్మం, మొటిమలు, వయసు పైబడినట్టు కనిపించడం వంటి చర్మ సమస్యలు నిద్రలేమి వల్ల వస్తాయి. 

click me!