రాత్రిపూట గుండెల్లో మంటగా ఉంటుందా? అయితే ఇలా చేయండి

First Published | Dec 20, 2023, 2:07 PM IST

చాలా మందికి రాత్రిపూట తినగానే గుండెల్లో మంటగా అనిపిస్తుంటుంది. కొంతమంది దీన్ని లైట్ తీసుకుంటే.. మరికొంతమంది భయపడిపోతుంటారు. అయితే ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఆ సమస్య తగ్గిపోతుంది. 
 

మనలో చాలా మంది రోజూ ఎదుర్కొనే సమస్యల్లో జీర్ణ సమస్యలు ఒకటి. ప్రస్తుత కాలంలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. వీటిలో ఎక్కువగా అజీర్ణం, మలబద్ధకం, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉంటాయి. ఆహారంలోని లోపాలే మనకు ఈ సమస్యలు వచ్చేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. కానీ చాలా మందికి రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఇది మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

heartburn

రాత్రి పడుకునేటప్పుడు జీర్ణ రసం జీర్ణాశయం బయటకు వస్తుంది. దీనితో పాటుగా తినే ఆహార పదార్థాల అవశేషాలు కూడా రావొచ్చు. రాత్రిపూట మసాలా దినుసులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే ఇక చెప్పనవసరం లేదు. దీనివల్లే కొంతమందికి గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అయినప్పటికీ.. రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపించడం సాధారణం అయితే.. దానిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


త్వరగా డిన్నర్

వీలైనంత త్వరగా డిన్నర్ చేయడం అందరికీ మంచిది. మీరు పడుకోవడానికి కనీసం రెండు లేదా మూడు గంటల ముందు తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. ఇలా తినడం వల్ల రాత్రిపూట గుండెల్లో మంట సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 
 

హెవీగా వద్దు

రాత్రిపూట మరీ హెవీగా తినడం కూడా మంచిది కాదు. ఇలా ఎక్కువగా తినేవారికి రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపించొచ్చు. అందుకే రాత్రిపూట మోతాదులో తేలికపాటి ఆహారాన్ని తినండి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట తక్కువగా తినాలి. 
 

eating food

నాలుగైదు సార్లు తినడం

రాత్రిపూట తక్కువగా తినడంతో పాటుగా మీ రోజువారి ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. అంటే రోజుకు మూడు సార్లు కాకుండా రోజుకు ఐదారు సార్లు లేదా రోజుకు ఏడు సార్లు కొంచెం కొంచెం తినడానికి ప్రయత్నించండి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
 

Sleeping


పానీయాలు

కొన్ని ఆహారాలు, పానీయాలు కూడా గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా మసాలా దినుసులు ఎక్కువగా ఉన్న, కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి తినకూడదు. ఎందుకంటే ఇవి కూడా గుండెల్లో మంటను కలిగిస్తాయి. 

రాత్రిపూట గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడానికి మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. అలాగే పడుకునేటప్పుడు దిండును కొద్దిగా పైకి లేపి పడుకుంటే గుండెల్లో మంట కాస్త తగ్గుతుంది. 
 

click me!