కడుపు నొప్పి ఉంటే అరటి పండు తినకూడదా.. ఒకవేళ తింటే ఏం జరుగుతుంది?

First Published Oct 21, 2021, 6:03 PM IST

కడుపు నొప్పి (Stomach Pain) అనేది ముఖ్యమైన సమస్య. కడుపులో ఎన్నోరకాలుగా నొప్పులు వస్తుంటాయి. అందులో చాలా మందిలో అరుగుదల సరిగా ఉండకపోవుట వలన సరిగా నీరు (Water) తాగకపోవడం వలన కడుపు నొప్పి వస్తుంటుంది.

కడుపు నొప్పి (Stomach Pain) అనేది ముఖ్యమైన సమస్య. కడుపులో ఎన్నోరకాలుగా నొప్పులు వస్తుంటాయి. అందులో చాలా మందిలో అరుగుదల సరిగా ఉండకపోవుట వలన సరిగా నీరు (Water) తాగకపోవడం వలన కడుపు నొప్పి వస్తుంటుంది.

ఇలా కడుపు నొప్పికి (Stomach Pain) చాలా కారణాలు ఉన్నాయి. అయితే చాలామంది కడుపు నొప్పిగా ఉన్నపుడు అరటి పండు (Banana) తినకూడదంటారు. ఇది ఎంత వరకు నిజం. అలాగే కడుపు నొప్పిగా ఉంటే ఏం తింటే బాగుంటుందో తెలుసుకుందాం.
 

చాలా మంది కడుపులో నొప్పి ఉన్నప్పుడు అరటిపండ్లు (Banana) తినడం మంచిది కాదని భావిస్తారు. నిజానికి అది అపోహ మాత్రమే. అరటి పండు తినడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటాసిడ్ (Antacid) వల్ల అజీర్తి సమస్యలు తగ్గును.
 

ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం (Ginger juice), ఒక స్పూన్  నిమ్మరసం (Lemon juice)తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఈ నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

ఒక స్పూన్ ఇంగువను (Asafoetida) తీసుకొని అందులో కొంచెం నీటిని (Water) వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బొడ్డు చుట్టూ రాస్తే అరగంటలో కడుపు నొప్పి తగ్గుతుంది.
 

ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్ చక్కెర (Sugar) వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి. జీలకర్ర, చక్కెర రెండింటిని బాగా నమిలి తినాలి. దీనివల్ల కడుపు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
 

కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా రాకూడదంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దాలియా,  పప్పులు వంటి హోల్ గ్రెయిన్స్ (Whole Grains) తీసుకోవడం, ఆకుకూరలు, బొప్పాయి పండు, పియర్ వంటి పీచు పదార్ధం (Fiber) ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

click me!