Health Tips : వర్షాలతో పాటు ఇబ్బంది పెట్టే వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఇంట్లో చిట్కాలతో కోలుకోండిలా?

Navya G | Published : Jul 21, 2023 12:45 PM
Google News Follow Us

Health Tips: వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్లను కూడా తీసుకొని వస్తుంది. అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇన్ఫెక్షన్స్ ని తరిమి కొట్టడం ఎలాగో చూద్దాం.
 

16
Health Tips : వర్షాలతో పాటు ఇబ్బంది పెట్టే వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఇంట్లో చిట్కాలతో కోలుకోండిలా?

ఇమ్యూనిటీ పవర్ గురించి అందరూ తక్కువ అంచనా వేస్తారు కానీ ఇలాంటి అప్పుడే ఇమ్యూనిటీ పవర్ వాల్యూ అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్లకే సీజనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అందులోనూ వర్షాకాలం మనల్ని మరింత ఇన్ఫెక్షన్లకి గురిచేస్తుంది.
 

26

 ఇన్ఫెక్షన్ ఎక్కువగా గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది దీంతోపాటు జ్వరం దగ్గు ముక్కు కారటం అంటే లక్షణాలు వెంట వెంటనే వచ్చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఎలర్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే కోలుకోవచ్చు.
 

36
Monsoons Hair Care

మీకు ముందుగా గొంతు నొప్పి ప్రారంభమవుతుంది అది ఎగువ శ్వాసకోస వ్యవస్థను ప్రభావం చేయడం వలన క్రమంగా జ్వరం రావడం దగ్గు జలుబు వంటివి వచ్చి మనల్ని ఇబ్బంది పడతాయి. అందుకే ముందుగా గొంతు నొప్పి అనిపించినా వెంటనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును వేసుకొని నోటిలో వేసుకుని పుక్కిలించండి.
 

Related Articles

46

అలా చేయడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆవిరి కట్టుకోవడం వలన ముక్కుకి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పట్టుకునే నీళ్లలో కొంచెం ఆయిల్ వేయడం వలన మరింత మెరుగైన ఫలితం కనబడుతుంది.
 

56

గొంతు నొప్పి అనిపించినా వెంటనే మీరు యాంటీబయాటిక్ తీసుకోవడం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లడం చేయకండి. మీకు జ్వరం వచ్చిందంటే మీ రోగ నిరోధక వ్యవస్థ వైరస్తో పోరాడుతున్నట్లు అర్థం. ఒంట్లో వేడి పెరగటం వలన తేలికపాటి ఇన్ఫెక్షన్లు నశిస్తాయి. అలా అని ఇంట్లో ఉండే ఏదో ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్స్  కూడా వేసుకోకండి.
 

66
Monsoon Wierd Traditions 00

గొంతు నొప్పి అనిపించినప్పుడు పెరుగు, సోడా కలిపిన పానీయాలు, పుల్లని పండ్లు తీసుకోవడం మానేయండి. పసుపు మిరియాలు కలిపిన పాలు తాగటం, ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వలన మీరు ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా కోలుకోవచ్చు అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Recommended Photos