కోపం ఇందుకే వస్తుంది.. ఇలా చేశారంటే చిటికెలో తగ్గిపోతుంది

First Published | Jul 21, 2023, 11:35 AM IST

కారణమేదైనా కోపం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు కూడా అమాంతం పెరగడం మొదలవుతుంది. ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 
 

ఏదో ఒక విషయంలో కోపం వస్తుంటుంది. ఇది చాలా సహజం. అయితే కొంతమంది ఈ కోపం నుంచి తొందరగా బయటపడతారు. కానీ ఇంకొంతమంది మాత్రం రోజుల తరబడి అలాగే కోపంగా ఉంటారు. కానీ కోపం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.  కోపం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరగడం మొదలవుతుంది. అలాగే శారీరక అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల మీ శరీరంలో ఆడ్రినలిన్, నోరాడ్రినలిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం.. కోపం రెండు పరిస్థితుల వల్ల వస్తుంది. మొదటిది బాహ్య సంఘటన. రెండోది అంతర్గత సంఘటన. బాహ్యం అంటే ఒక వ్యక్తి  మాటలు లేదా ఒక పరిస్థితిపై కోపం లేదా ఆవేశం రావడం. ఇక అంతర్గత సంఘటన అంటే గతంలో ఒకవ్యక్తి చేసిన పని గుర్తుకు రావడం, పాత విషయాలను గుర్తుచేసుకోవడం. ఇది అతని లోపల ఆవేశాన్ని పెంచుతుంది. 



నిపుణుల ప్రకారం.. కోపం రానివారు ఎవరూ ఉండదు. ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది. ఇది చాలా సహజమైన భావోద్వేగం. కానీ ఒక్కోసారి కొంతమందిలో కోపం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఇలాంటి వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. దీనికోసం ముందుగా వీళ్లు .. కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. తర్వాత కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. 

కోపం రావడానికి కారణాలేంటి?

ఒకరి పనిని డిస్టబ్ చేయడం
గట్టిగా మాట్లాడటం
పదేపదే ఏదో ఒకదానికి అంతరాయం కలిగించడం
ఫీలింగ్స్ ను అర్థం చేసుకోకపోవడం
ఎప్పుడూ ఎగతాళి చేయడం
అనకూడని మాటలు అనడం

కోపాన్ని తగ్గించే చిట్కాలు

మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి

మీకు ఎవరిపైనైనా కోపం ఉంటే వారికి ఏదైనా విషయం చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మీరు చెప్పేది అవతలి వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారని. మీ మాటలు మీ సంబంధాన్ని నాశనం చేస్తయేమో ఆలోచించండి. ఇందుకోసం 10 నుంచి 15 సెకన్ల టైం తీసుకోండి. ప్రశాంతంగా ఉండి కాసేపు ఓపిక పట్టండి. కోపం తగ్గిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇది వారు చేసిన తప్పు తెలిసొచ్చేలా చేస్తుంది. 

ఆలోచనలను ఒక కాగితంపై రాయండి

తప్పుడు సమయంలో తప్పుడు పదాలను ఉపయోగించడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా కోపాన్ని పెంచుతాయి. అందుకే మీకు ఎవరిపైనైనా కోపం ఉంటే.. అవతలి వ్యక్తిని మీరు ఏమనాలి అనుకుంటున్నారో పేపర్ పై రాయండి. ఎందుకంటే ఇలా రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది లోపలి నుంచి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. 
 

ఆరుబయట కొంత సమయాన్ని గడపండి

ఎప్పుడూ ఇంట్లో ఉంటే కూడా ఒత్తిడి పెరుగుతుంది. కోపం వస్తుంది. అందుకే కాసేపు స్నేహితులతో ఆరుబటకు వెళ్లి కాసేపు గడపండి. ఇది మీ ఆందోళనను తగ్గిస్తుంది. కావాలనుకుంటే మీకు ఇష్టమైన పనులను చచేయండి. ఇది మీ శరీరం, మనస్సును తేలికపరుస్తుంది. ప్రశాంతంగా ఉంచుతుంది. 

వ్యాయామం కూడా ముఖ్యమే

మిమ్మల్ని మీరు టెన్షన్ లేకుండా ఉంచడానికి రెగ్యులర్ గా వ్యాయమం చేయండి. లేదా రోజులో కొద్దిసేపు యోగా చేయండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ కోపాన్ని కూడా తగ్గిస్తుంది. వ్యాయామం మీ మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది. అలాగే మీ మానసిక స్థితిని బలపరుస్తుంది.
 

ఏదైనా పనిలో నిమగ్నమవ్వండి

మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి. ఇది మీ మనస్సును ఇతర విషయాలతో బిజీగా చేస్తుంది. మీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు మీపై ప్రభావం చూపవు. అలాగే యాంగ్జైటీ కూడా తగ్గిపోతుంది.
 

Anger

రివర్స్ కౌంటింగ్ 

కోపం వచ్చినప్పుడల్లా మీ మానసిక ఆరోగ్యమే కాదు మీ శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కోపాన్ని కంట్రోల్ చేయడానికి రివర్స్ కౌంటింగ్ చేయడం ప్రారంభించండి. ఇది మీ ఆలోచనలను మళ్లిస్తుంది. మీ మనస్సును తేలికగా, ఒత్తిడి లేకుండా చేస్తుంది.
 

Latest Videos

click me!