గుండెపోటు రావొద్దంటే..!

First Published Jun 7, 2023, 7:15 AM IST

మహిళల్లో కొన్ని గుండె  జబ్బుల ప్రమాద కారకాలు, లక్షణాలు పురుషుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మహిళల్లో గుండె జబ్బుల ప్రమాద కారకాలు, లక్షణాల గురించి తెలుసుకుంటే గుండెపోటుకు దూరంగా ఉండొచ్చు. 

heart attack

కొరోనరీ హార్ట్ డిసీజ్ గుండెపోటుకు అత్యంత సాధారణ కారణం. ఇది ప్రాణాంతకం. అయితే గుండె జబ్బులు రావొద్దంటే దీని ప్రమాద కారకాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యంగా వీటి గురించి తెలుసుకోవడం, ఈ ప్రమాద కారకాలన్నింటినీ దూరంగా ఉండటానికి మంచి జీవనశైలిని అనుసరించాలి. ఇదే మిమ్మల్ని గుండె జబ్బులకు, గుండెపోటుకు దూరంగా ఉంచుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

high blood pressure

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. మీ ధమనులు, ఇతర రక్త నాళాలలో ప్రవహించే రక్తం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు సమస్య వస్తుంది. కానీ ఇది మీ గుండె, మూత్రపిండాలు, మెదడు, ఇతర ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తుంది. డాక్టర్ సలహాతో రక్తపోటును నియంత్రించండి. 
 

മദ്യം

 ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం

ఒకే సిట్టింగ్ లో మూడు కంటే ఎక్కువ గ్లాసుల మందును తాగడం వల్ల మీ రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది.  కానీ ఈ రక్తపోటు కాలక్రమేణా మీ గుండె కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీకు గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

sedentary lifestyle

నిశ్చల జీవనశైలి

మీకు ఇతర ప్రమాద కారకాలు ఏమీ లేనప్పటికీ.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిశ్చల జీవనశైలి మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి ఇతర గుండె జబ్బులకు కారణమయ్యే కారకాల ప్రమాదం పెరుగుతుంది. 

అనారోగ్యకరమైన ఆహారం

ఉప్పు, కొవ్వు, చక్కెరలు ఎక్కువగా ఉన్న అనారోగ్యకరమైన ఆహారం మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మీ గుండెతో సహా మీ ధమనుల గోడలలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది మీ ధమనులను చిన్నగా చేస్తుంది. గట్టిపరుస్తుంది . ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 

smoking

ధూమపానం

స్మోకింగ్ మీ గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ రక్త నాళాలలో ఫలకం ఏర్పడేలా చేస్తుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

click me!