కొబ్బరి నూనెను వంటకు వాడొచ్చా?

First Published Jun 6, 2023, 1:25 PM IST

కొబ్బరి నూనెను జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ నూనె చర్మానికి, జుట్టుకు మంచి మేలు చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ నూనెను వంటకు ఉపయోగించొచ్చా? 
 

దక్షిణ భారతీయులు ముఖ్యంగా మలయాళీలు కొబ్బరి నూనెతో వంట చేస్తారు. చాలా మంది ఇతర వంట నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె వాసన, టేస్ట్  అస్సలు నచ్చదు. అందుకే దీన్ని వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే మన దేశంలో కూడా కొబ్బరినూనెను వాడే వారు చాలా మందే ఉన్నారు. కానీ కొంతమందికి కొబ్బరినూనె వాడకంపై ఎన్నో అనుమానాలు ఉంటాయి. కొబ్బరినూనెను వంటల్లో వాడటం అస్సలు మంచిది కాదని  కొంతమంది చెప్తుంటారు. ఇంకొంతమంది మంచిదని అంటుంటారు. నిజానికి కొబ్బరినూనెను వంటల్లో వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

గుండె ఆరోగ్యానికి...

కొబ్బరి నూనెలో 50 శాతం లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే బీపీ లేదా రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కొవ్వు తగ్గకుండా ఉండాలంటే...

కొబ్బరి నూనె జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంచేందుకు సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన వంట నూనె.
 

ఇమ్యూనిటీ

మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. 
 

డయాబెటిస్ కోసం...

డయాబెటిస్ పేషెంట్లకు కూడా కొబ్బరి నూనె మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నూనె రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

పోషకాలు...

కొబ్బరి నూనెలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలో విటమిన్-ఇ, విటమిన్-కె, ఇనుము వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన శరీర విధులకు ఉపయోగపడతాయి.

click me!