పచ్చిగుడ్లను తింటే దద్దుర్లు, తామర లేదా దురద వంటి చర్మ సమస్యలు వస్తాయి. అలాగే ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, తుమ్ములు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ శ్వాసకోశ లక్షణాలకు ఉదాహరణలు. వికారం, వాంతులు, కడుపు అసౌకర్యం లేదా విరేచనాలు వంటి జీర్ణ రుగ్మతలు కూడా పచ్చిగుడ్డును తినడం వల్ల వస్తాయి.