ముద్దు వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?

First Published May 30, 2023, 9:38 AM IST

ముద్దు ఒక అందమైన అనుభూతి. ముద్దు ఒక వ్యక్తిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను తెలుపుతుంది. కానీ ముద్దుతో కూడా వ్యాధులు వస్తాయి. దాన్నే మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు. ఈ వ్యాధిని లైట్ తీసుకోవడానికి లేదు. 

మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో అని పిలువబడే ముద్దు వ్యాధి గురించి తెలిసిన వారు చాలా తక్కువే. ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది 95 శాతం మందిని ప్రభావితం చేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్, లేదా EBV వల్ల వస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. అన్ని EBV ఇన్‌ఫెక్షన్‌లు మోనోగా మారవు. కానీ కొన్ని మోనో గా మారుతాయి. 

మోనో అంటువ్యాధేనా? 

అవును మోనో వైరస్ లు అంటువ్యాధులు. ఇవి లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. అందుకే ఈ సంక్రమణను ఎక్కువగా ముద్దు వ్యాధి అని పిలుస్తారు. అయితే మోనో సంక్రమించడానికి ముద్దు ఒక్కటే మార్గం కాదు. మోనో సెక్స్ , పాత్రలు లేదా పానీయాలను పంచుకోవడంతో పాటుగా ఇతర మార్గాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. 
 


ముద్దు వ్యాధి లక్షణాలు

అలసట
గొంతు నొప్పి 
కనీసం 100.4 ఉష్ణోగ్రతతో జ్వరం
రోజంతా లేదా రాత్రి మొత్తం చెమటలు
వికారం
తలనొప్పి
చలి
ఒంటి నొప్పులు
దగ్గు
ఆహారాన్ని మింగడంలో సమస్యలు
ఆకలి లేకపోవడం

గొంతునొప్పి అతి పెద్ద లక్షణం

ముద్దు వ్యాధిలో గొంతు నొప్పి అతిపెద్ద లక్షణమంటున్నారు నిపుణులు. మోనో వల్ల శోషరస కణుపులు వాపు వస్తాయి. దీనివల్ల గొంతు నొప్పి వస్తుంది. అసలు మీకు గొంతు నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో తెలుసుకోవడానికి హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే లక్షణాలు తరచుగా ఇతర అంటు వ్యాధుల మాదిరిగానే ఉంటాయి. 
 

kissing causes oral infections

నివారణ చర్యలు

ఈ ముద్దు వ్యాధి బారిన పడకూడదంటే ముందుగా మీ చేతులను తరచుగా సబ్బు, గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవడం అలవాటు చేసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటికి కర్చీఫ్ ను అడ్డం పెట్టుకోండి. ఇన్ఫ్లుఎంజా, కోవిడ్-19 వంటి ఇతర తీవ్రమైన అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి ఇదెంతో సహాయపడుతుంది.
 

ఫైనల్ గా.. 

హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ముద్దు వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటే మోనో నుంచి తొందరగా కోలుకుంటారు. హైడ్రేట్ గా ఉండటానికి మీకు వీలైనప్పుడల్లా రసం, కాఫీ, సోడా కంటే నీళ్లనే ఎక్కువగా తాగండి. మీ శరీరాన్ని మరమ్మత్తు చేయడానికి రాత్రిపూట ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకు వీలైనప్పుడు న్యాప్ తీసుకోండి. అలసటను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ సూచించిన యాంటీ వైరల్ మందులు తీసుకునేటప్పుడు మీరు సరిగ్గా విశ్రాంతి తీసుకోండి. 

click me!