మైదా పిండిని తింటే ఈ రోగాలు తప్పవు జాగ్రత్త..

First Published May 28, 2023, 3:37 PM IST

మైదా పిండి పేగులకు అంటుకుంటుంది. మీరు ఈ పిండితో చేసిన ఫుడ్స్ ను ఎంత తిన్నా మీకు పోషకాలు అసలే అందవు. ఇది మీ కడుపును నింపి ఎన్నో రోగాల బారిన పడేస్తుంది తెలుసా? 
 

ఈ రోజుల్లో జంక్ ఫుడ్, బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీలో మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ పిండి మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ పిండి పేగులకు అంటుకుంటుంది. దీని వల్ల మీరు ఎంత తిన్నా వాటి పోషకాలు శరీరానికి అందవు. అలాగే ఈ పిండి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే ఈ పిండికి బదులుగా వేరే ఆరోగ్యకరమైన పిండిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మైదా పిండిని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది

మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పిండితో చేసిన ఆహార పదార్థాలను తినేటప్పుడు మీ శరీరం ఎక్కువ చక్కెరను రిలీజ్ చేస్తుంది. ఇది నేరుగా మీ రక్తప్రవాహంలోకి వెళుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే మైదాను మొత్తమే తినకండి. అలాగే మైదాపిండితో చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

బరువు పెరగడానికి కారణమవుతుంది

మైదాను జంక్ ఫుడ్స్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మీ శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ పిండి మెటబాలిజం రేటుపై ప్రభావం చూపుతుంది. మైదాను క్రమం తప్పకుండా తినడం వల్ల మెటబాలిజం ప్రభావితమయ్యి శరీరం కొవ్వును కరిగించడం మానేసి శరీరం బరువును పెంచడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఊబకాయం, స్థూలకాయం సమస్యలు వస్తాయి. 
 

జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు

మైదా పిండిలో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తగినవి కావు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. కానీ మైదా పిండిలో ఫైబర్ కంటెంట్ ఉండదు.

మైదాను తినేటప్పుడు ఇది మీ పేగులకు అంటుకుంటుంది. అలాగే దానిని బయటకు తీయడం చాలా కష్టమవుతుంది. దీని వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల గట్ ఇన్ఫ్లమేషన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే మైదా పిండికి బదులుగా వేరే ఆరోగ్యకరమైన పిండిని తీసుకోండి. 
 

ఎముకలు బలహీనపడతాయి

మైదా పిండి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది. మైదాలో ఉండే ఆమ్లాలు ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ వంటి ఎముకల సమస్యలకు కారణమవుతాయి.
 

కొలెస్ట్రాల్ ను పెంచుతుంది

మైదా ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది రక్త నాళాలను అడ్డుకుంటుంది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
 

ఆకలి పెరుగుతుంది

మైదా పిండితో చేసిన ఆహారాలను తినడం వల్ల మీకు తరచుగా ఆకలి అవుతుంది. అలాగే తీపి కోరికలు కూడా పెరుగుతాయి. అలాగే మీరు ఎక్కువగా జంక్ ఫుడ్స్ ను తింటారు. ఇది కేలరీలు తీసుకోవడాన్ని కూడా పెంచుతుంది. అతిగా తినడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. వీటిలో సర్వసాధారణమైనవి మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు. అలాగే ఇది చర్మంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. 

click me!