పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే..!

First Published May 29, 2023, 7:15 AM IST

రాత్రిపూట పాలలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఖర్జూరాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే..
 

dates

 డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇలాంటి వాటిలో ఖర్జూరం ఒకటి. నిజానికి ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మూడు ఖర్జూరాల్లో సుమారు 200 కేలరీలు, 54 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఐదు గ్రాముల ఫైబర్, ఒక గ్రాము ప్రోటీన్, కొవ్వు ఉంటుంది. వీటిలో బి విటమిన్లు, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. 

dates

ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పాలలో ఖర్జూరాలను నానబెట్టి ఉదయం వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో మన శరీరానికి ఉపయోగపడే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే పాలు కండరాలకు అవసరమైన కాల్షియాన్ని అందిస్తాయి. అలాగే రాత్రిపూట పాలలో ఖర్జూరాలను కలుపుకుని తాగడం వల్ల మన శరీర శక్తి స్థాయి పెరుగుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. 

పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మీకు తెలుసా? ఖర్జూరాలకు శరీరంలో ఇనుము పరిమాణాన్ని పెంచే గుణం ఉంటుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరాలను పెద్దలకు ఇవ్వడం వల్ల వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత వంటి సమస్యలు దూరం అవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

dates

ఖర్జూరాలు సహజ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలమని 2019 అధ్యయనం కనుగొంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి సంబంధించిన అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 2017 అధ్యయనంలో ప్రచురించబడిన ఇతర పరిశోధనలు.. ఖర్జూరాలలో కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని వెల్లడించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఎహెచ్ఎ) ప్రకారం.. మహిళలు రోజుకు ఆరు టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు. ఇది 25 గ్రాములు లేదా 100 కేలరీలకు సమానం.

2020 అధ్యయనంలో భాగంగా.. ఖర్జూరాల వినియోగాన్ని రక్తంలో కొవ్వు, గ్లైసెమిక్ సూచికలో పరిశీలించారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వంద మంది పురుషులు, మహిళలు యాదృచ్ఛికంగా ఖర్జూరాలు తినాలని లేదా 16 వారాల పాటు రోజూ మూడు ఖర్జూరాలను చేర్చాలని సూచించారు. ఖర్జూరం తిన్న వారిలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో తగ్గినట్టు కనుగొన్నారు.

ఖర్జూరాల్లోని సమ్మేళనాలు మెదడును రక్షించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలకు మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం ఉంది.
 

click me!