మండుతున్న ఎండలు.. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ చిట్కాలను తప్పక పాటించండి..

Published : Apr 10, 2023, 03:42 PM IST

ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే  ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
16
మండుతున్న ఎండలు.. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ చిట్కాలను తప్పక పాటించండి..
summer

మండుతున్న ఎండలు ఒంట్లో ఉష్ణోగ్రతను ఇట్టే పెంచేస్తాయి. యూవీ కిరణాల ప్రభావం ముఖంతో పాటుగా మొత్తం శరీరంపై పడుతుంది. చెమట పట్టడం, తరచుగా దాహం వేయడం, అలసట కలుగుతాయి. ఎండాకాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలాసార్లు డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, మైకము, కంటి నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. 

26

కూల్ డ్రింక్స్ తాగండి

రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చల్లగా,  రుచిగా ఉండే పండ్లు, కూరగాయల రసాలను తాగాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి. అయితే వీటిని రోజూ తాగాలి. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే ముందు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొబ్బరి నీరు, చల్లని లస్సీ, పుచ్చకాయ లేదా దానిమ్మ రసాన్ని తాగండి. వీటిని తాగితే పదేపదే దాహం వేయదు. అలాగే మీ టేబుల్ పై వాటర్ బాటిల్ ను ఖచ్చితంగా పెట్టండి. రోజంతా మీరు నీటిని పుష్కలంగా తాగితే వడదెబ్బ ప్రమాదం తగ్గుతుంది. 
 

36

వదులుగా ఉండే దుస్తులు

రోజంతా బిగుతైన దుస్తులు ధరించడానికి బదులుగా లేత రంగులు, వదులుగా ఉండే దుస్తులనే వేసుకోండి. ఇలాంటి దుస్తుల్లో ఎక్కువ చెమట పట్టే అవకాశం ఉండదు. అలాగే కాటన్ దుస్తులు కూడా ఊపిరి పీల్చుకునేలా ఉంటాయి. యాక్రిలిక్ లేదా నైలాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ధరించడం వల్ల వేసవిలో దద్దుర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రీసెర్చ్ గేట్ ప్రకారం.. తెలుపు లేదా ప్రకాశవంతమైన దుస్తులు నలుపు, ముదురు దుస్తుల కంటే ఎక్కువ వేడిని గ్రహించవు. ఇది శరీరానికి సౌకర్యంగా, సురక్షితంగా ఉంచుతుంది.
 

46

UV rays can be the cause of many eye problems. Protecting your eyes from exposure is a must. Flaunt your shades. The bigger the better. Be sure they give UV protection.

సన్ గ్లాసెస్, టోపీలు

ఎండలో బయటకు వెళ్లే ముందు తలకు టోపీ, కళ్లకు కళ్లద్దాలు ధరించడం చాలా ముఖ్యం. ఇవి వేడి నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీకు క్లాసీ లుక్ ను కూడా ఇస్తాయి. సన్ గ్లాసెస్ మీ కార్నియాను యువి కిరణాల నుంచి రక్షిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం.. సన్ గ్లాసెస్ ఎంచుకునే ముందు అవి 99 నుంచి 100 శాతం యువీఏ, యూవీబీ కిరణాలను నిరోధించగలిగేలా ఉండాలి. అలాగే లేత రంగు టోపీలు మీ తలను వేడి ప్రభావం నుంచి రక్షిస్తాయి. అలాగే చల్లగా ఉంచుతాయి.
 

56

సీజనల్ పండ్లు,  కూరగాయలు 

స్పైసీ ఫుడ్ ను తింటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. నిజానికి కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఉండే ఆహారం మీ జీర్ణవ్యవస్థను నెమ్మదింపజేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్ లో స్పైసీ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. దోసకాయలు, పుచ్చకాయలు, ఇతర ఆకుకూరలు వంటి వాటర్ కంటెట్ ఎక్కువగా పండ్లు, కూరగాయలను తినండి.
 

66
aloe vera gel

కలబంద

అలోవెరా జెల్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని మెడతో పాటుగా ముఖం, చేతులకు అప్లై చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి ముందు జెల్ ను ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని గంటలు చల్లారనివ్వండి. ఆ తర్వాత అప్లై చేయండి. కావాలనుకుంటే శరీరాన్ని చల్లబరచడానికి కలబంద జ్యూస్ ను కూడా తాగొచ్చు. 

click me!

Recommended Stories