జ్యూసీగా, టేస్టీగా, తీయగా ఉండే మామిడి పండ్లను చూస్తూ తినకుండా ఉండటం చాలా కష్టం. పండ్లలో రారాజు అయిన మామిడి పండు ఒక్క ఎండాకాలంలో లభిస్తుంది. ఈ సీజన్ పోతే మళ్లీ దొరకవని రోజూ తినేవారున్నారు. నిజానికి మామిడి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు ఆకలిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. విటమిన్లు, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉండే మామిడి పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. అయితే చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కానీ వీటిని కూడా డయాబెటీస్ పేషెంట్లు తినొచ్చు.