ఈ కూరగాయలతో మీ గుండె ఆరోగ్యం పదిలం

Published : Apr 09, 2023, 02:45 PM IST

అనారోగ్యకరమైన జీవన శైలి వల్లే చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఎంతో మంది గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. అయితే కొన్ని రకాల కూరగాయలు గుండెను పదిలంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
ఈ కూరగాయలతో మీ గుండె ఆరోగ్యం పదిలం

heart

ప్రస్తుతం హృద్రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి గుండె  జబ్బులకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె పదిలంగా ఉండాలంటే మంచి జీవన శైలి అలవాట్లను అలవర్చుకోవడమే కాదు.. ఆరోగ్యకరమైన  ఆహారాలను కూడా తినాలి. నిపుణుల ప్రకారం.. కొన్ని కూరగాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటంటే.. 

26

బచ్చలికూర

బచ్చలికూరలో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ పుష్కలంగా  ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే బచ్చలికూర గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

36
cabbage

క్యాబేజీ

ఎన్నో పోషకాలున్న కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

46

బ్రోకలీ

బ్రోకలీలో మెగ్నీషియం , పొటాషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ,  ఫైబర్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. బ్రోకలీని మీ  డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. 
 

56
Image: Getty Images

టమాటాలు

టమాటాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ కె రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా  కాపాడుతుంది. కాబట్టి టమోటాలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోండి. 

66

beet root

బీట్ రూట్

మన ఆరోగ్యానికి బీట్ రూట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. బీట్ రూట్ పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

click me!

Recommended Stories