ఆఫీస్, మాల్ లేదా ఇతర పబ్లిక్ ప్లేస్ లో మనకు ఇష్టం లేకపోయినా పబ్లిక్ టాయిలెట్లను ఖచ్చితంగా ఉపయోగించాల్సి వస్తుంది. కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా టాయిలెట్ సీటుపై క్రిములు ఉంటాయి. కానీ పబ్లిక్ టాయిలెట్ సీటుపై ఎన్నో వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
ఆఫీస్, మాల్ లేదా ఇతర పబ్లిక్ ప్లేస్ లో మనకు ఇష్టం లేకపోయినా పబ్లిక్ టాయిలెట్లను ఖచ్చితంగా ఉపయోగించాల్సి వస్తుంది. కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా టాయిలెట్ సీటుపై క్రిములు ఉంటాయి. కానీ పబ్లిక్ టాయిలెట్ సీటుపై ఎన్నో వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు
టాయిలెట్ సీట్లను ఉపయోగించడం వల్ల ప్రణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే వ్యాధుల ప్రమాదం లేదని మాత్రం కాదు. అయితే టాయిలెట్ సీట్లపై కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్లు ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇన్ఫ్లుఎంజా వైరస్లు టాయిలెట్ సీట్ల వంటి రంధ్రాలు లేని ఉపరితలంపై 2 లేదా 3 రోజులు మాత్రమే జీవించగలవు.
TOILET SEAT
చర్మ దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్
ఎస్చెరిచియా కోలి అనేది టాయిలెట్ సీట్లలో ఉండే సాధారణ బ్యాక్టీరియా. ఇది సోకితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తయాి. స్టెఫిలోకోకస్ వంటి బ్యాక్టీరియా రెండు నెలల కంటే ఎక్కువ కాలం రంధ్రాలు లేని ఉపరితలాలను కలుషితం చేస్తుంది. కలుషితమైన టాయిలెట్ సీటులో 3 నిమిషాలు ఉంటే చర్మపు దద్దుర్లు లేదా సంక్రమణ వస్తుంది. షిగెల్లా వంటి బ్యాక్టీరియా కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది.
టాయిలెట్ సీటు ఉపయోగించే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి
మురికి టాయిలెట్ సీటుతో పోలిస్తే శుభ్రమైన టాయిలెట్ సీటును ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియా బారిన పడే అవకాశాలు ఖచ్చితంగా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించాల్సి వస్తే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. టాయిలెట్ సీటును ఉపయోగించిన తర్వాత బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి ప్రయత్నించాలి.
ఇందుకోసం టాయిలెట్ ను ఉపయోగించిన తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మీరు చేతులు కడుక్కునే వరకు నోరు, కళ్లు, ముక్కు లేదా ఇతర సున్నితమైన ప్రాంతాలను, ఏదైనా ఆహారాన్ని చేతులతో అసలే తాకకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అలాగే యాంటీ బాక్టీరియల్ ఆల్కహాల్ వైప్స్ ను మీ వెంట తీసుకెళ్లండి. ఉపయోగించే ముందు టాయిలెట్ సీటును నీరు, టిష్యూ, శానిటైజర్ తో తుడిచి, ఆపై కూర్చోండి.
మూత్రాన్ని ఆపడం మరింత ప్రమాదకరం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చాలాసార్లు మరుగుదొడ్డిని ఉపయోగించాలనే భయంతో కొంతమంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుతారు. మూత్రం రాకూడదని మీరు వాటర్ తాగకపోయినా.. మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నీరు తాగకపోవడం వల్ల మీ శరీరం నిర్జలీకరణం బారిన పడుతుంది. అలాగే మీ శరీరంలో టాక్సిన్స్ ఏర్పడుతాయి. శరీరంలో టాక్సిన్స్ ఎంత ఎక్కువగా ఉంటే టాయిలెట్ సీటు నుంచి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. ఇది మూత్రాన్ని మరింత నివారించడంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. '