Health Tips: చూయింగ్ గమ్ ఎక్కువగా నములుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

Published : Sep 15, 2023, 12:30 PM IST

 Health Tips: చూయింగ్ నమలటంపై ఇప్పటికీ చాలామందికి అపోహలు ఉన్నాయి. అది తినకూడదని, తింటే అనారోగ్యమని ఇప్పటికీ చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఇది నమలటం  ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
16
 Health Tips: చూయింగ్ గమ్ ఎక్కువగా నములుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

 చూయింగ్ గమ్ నమలడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు నమలడం అస్సలు వదిలిపెట్టరు. ఎందుకంటే చూయింగ్ గమ్ నమలటం వలన నోటి యొక్క దుర్వాసన సమస్య దూరమవుతుంది. అలాగే చూయింగ్ గమ్ నవలటం వలన ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్సైజ్ అయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 

26

 అలాగే ఇది నమలటం వలన ఆకలి కాస్త తగ్గి చిరుతుళ్ళకి దూరంగా ఉంటారు. దీనివలన ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది. చూయింగ్ గమ్ నమలని వారు కనీసం 68 క్యాలరీల ఆహారం అధికంగా తీసుకుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమిలే వారిలో ఐదు శాతం వరకు అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయని గుర్తించారు.

36

 బ్రేక్ ఫాస్ట్ లంచ్ మధ్య విరామంలోనే ఇది పనిచేస్తుంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల డబుల్ చిన్ సమస్య తొలగిపోతుంది. చూయింగ్ గమ్ హిప్పోకంపాస్  మెదడులోని భాగాన్ని సక్రియం చేస్తుంది.

46

అంటే జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి నీ మెరుగుపరుస్తుంది. అలాగే చూయింగ్ నమలడం వల్ల ఒత్తిడిని, చికాకుని తగ్గించుకోవచ్చు. అలాగే పసుపు రంగులో ఉండే దంతాలు తెలుపు రంగులోకి మారటానికి చూయింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

56

అయితే చాలామంది తమ పిల్లలు చూయింగ్ గమ్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని, మరొకసారి తినొద్దని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నమిలి మింగితే సమస్యలు వస్తాయి కానీ నమిలిన తర్వాత మిగిలిన పదార్థాన్ని బయటకి వూసివేస్తే ఎలాంటి ప్రమాదము ఉండదు.

66

పైగా దీనివల్ల  ఎన్ని లాభాలు ఉన్నాయో చూశారు కదా. అయితే మీరు తినవలసింది నార్మల్ చూయింగ్ కాదు. కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినటం వలన పై లాభాలన్నీ పొందవచ్చు. అలాగే నమిలిన తర్వాత దానిని మింగకుండా జాగ్రత్త పడండి.

click me!

Recommended Stories