దంతాల శుభ్రత
బేకింగ్ సోడా సహజమైన టూత్ పేస్ట్‌లా పనిచేస్తుంది. చిగుళ్ల సమస్యలు ఉన్న వాళ్లు, పళ్లు గార పట్టిన వాళ్లు బేకింగ్ సోడాతో దంతాలు తోముకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది పళ్లపై ఉన్న ప్లాక్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ లో బేకింగ్ సోడా కంటెంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
గొంతు నొప్పికి మంచి మందు
సాధారణంగా పొల్యూషన్, డస్ట్ ఎలర్జీ వల్ల చాలామంది తరచూ గొంతు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు కలిపి పుక్కళించడం ద్వారా గొంతు సమస్యలు తగ్గుతాయి.
అలా అని బేకింగ్ సోడాను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. సరిపడా మోతాదులో మాత్రమే వినియోగించాలి.