7.తగినంత నిద్ర లేకపోవడం
మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజం. కనీసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాల్సిందే.
8.వ్యాయామం లోపం*
శారీరక శ్రమ లేకపోతే కాలేయంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి, ఇది ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. కనీసం రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
9.అనుమానాస్పద హెర్బల్ సప్లిమెంట్స్
కొన్ని ఆయుర్వేద/హెర్బల్ టాబ్లెట్లు కాలేయంపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి, వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వాడాలి.
10.పర్యావరణ కాలుష్యం ప్రభావం
ధూళి, వాయు కాలుష్యం, రసాయనాల గాలి శ్వాసించడం కూడా కాలేయానికి నెమ్మదిగా హాని చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
తక్కువ చక్కెర, తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలి
రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి
మద్యం పరిమితంగా లేదా పూర్తిగా మానేయాలి
క్రమంగా వ్యాయామం, యోగా చేయాలి
రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి