Weight Loss: అరటిపండు తింటే బరువు తగ్గుతారా? పెరుగుతారా?

Published : Feb 18, 2025, 11:35 AM IST

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అరటిపండును ఇష్టంగా తింటారు. అరటిపండు ఒక్కటి తిన్న చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అయితే అరటిపండు తింటే బరువు తగ్గుతారా? పెరుగుతారా? అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. మరి నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Weight Loss: అరటిపండు తింటే బరువు తగ్గుతారా? పెరుగుతారా?

సులభంగా, తక్కువ ధరకు దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే పండ్లలో ఇది ముందువరుసలో ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కానీ బరువు తగ్గడానికి అరటిపండు తినడం మంచిదా? కాదా? అని చాలామందిలో డౌట్ ఉంటుంది. అరటిపండు తింటే బరువు పెరుగుతారని కొందరు నమ్ముతారు. ఇంతకీ అరటి పండు తింటే బరువు తగ్గుతారా? పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

25
అరటిపండులోని పోషకాలు:

నిపుణుల ప్రకారం ఒక మీడియం సైజు అరటిపండులో 15 కేలరీలు, 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కాకుండా 3 గ్రాముల ఫైబర్, ఒక గ్రాము ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా అరటిపండులో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కొవ్వు ఉండదు.

35
బరువుపై ప్రభావం

అరటిపండు బరువు పెరగడానికి, తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అదే నిజం. అరరటిపండును ఎప్పుడు, ఎలా తీసుకుంటారనే దానిపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అరటిపండును మితంగా తీసుకుంటే, దానిలోని ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. దాని పూర్తి పోషకాలను పొందవచ్చు.

45
బరువు తగ్గడానికి..

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అందులో అరటిపండు ఒకటి. దీన్ని తినడం వల్ల శరీరంలో కేలరీల స్థాయి పెరగదు. ఈ పండులో ఉండే ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా ఇందులో సహజంగా తీపి ఉండటం వల్ల తీపి తినాలనే కోరికను తగ్గిస్తుంది. కాబట్టి పోషకాలతో నిండిన అరటిపండును మితంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా పొందవచ్చు.

55
బరువు పెరగడానికి కూడా..

అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. కానీ దీన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అతిగా తీసుకున్నప్పుడు, శరీరంలో కార్బోహైడ్రేట్లు పేరుకుపోయి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీంతో బరువు పెరుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories