ఈ చిట్కాలు పాటించండి.. ఆరోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పండి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 10, 2021, 11:02 AM IST

మన జీవితకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో పది కాలాల పాటూ జీవించాలనుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్య సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా ఉండటం కోసం మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం అవసరం. 

PREV
16
ఈ చిట్కాలు పాటించండి.. ఆరోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పండి?

మన జీవితకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో పది కాలాల పాటూ జీవించాలనుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్య సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా ఉండటం కోసం మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం అవసరం. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం..
 

26

అల్లం శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా వరకు మనం తిన్న ఆహారం కొన్ని కొన్ని సార్లు జీర్ణం కాకపోవడం వల్ల శరీరం లోపల పసరు వంటిది ఎక్కువవుతుంది. దానివల్ల వికారంగా, తల నొప్పిగా ఉండటం ఉంటుంది. కాబట్టి పరిగడుపున అల్లం కాల్చుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అల్లంను తేనెలో కలుపుకొని కూడా తినవచ్చు.
 

36

భోజనం తర్వాత ప్రతి ఒక్కరు కాసేపు నడవాలి. దీనివల్ల శరీరానికి ఆయాసం అనేది ఉండదు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కనీసం వంద అడుగులు వేయాలి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం సులువుగా ఉంటుంది. భోజనం తర్వాత కదలకుండా కూర్చుంటే పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి పది నిమిషాలు నడవడం మంచిది.      
 

46

రాత్రి భోజనం తర్వాత తమలపాకు తాంబూలం వేసుకోవాలి. తమలపాకులలో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలకు తమలపాకు సంజీవనిగా పనిచేస్తుంది. భోజనం తర్వాత తమలపాకు వేసుకున్నాక ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండెకు రక్తప్రసరణ సమృద్ధిగా జరిగి గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.
 

56

మన రోజువారీ ఆహార సమయాలలో మితముగా భుజించుట వలన మన జీర్ణవ్యవస్థ, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తినడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి.                          
 

66

ముఖ్యంగా భోజన సమయంలో మాట్లాడకుండా తినాలి. అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా మరియు మౌనంగా తింటే అన్నం అరిగించే హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉంటుంది. తినేటప్పుడు మనసును, మాటలను అదుపులో ఉంచుకోని మౌనంగా తినాలి. దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు. లేదంటే బిపి, షుగర్ వంటి సమస్యలు రావడం గ్యారెంటీ.

click me!

Recommended Stories