మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే పాటించాల్సిన 7 చిట్కాలు ఇవే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 09, 2021, 12:00 PM IST

ఈ రోజుల్లో అందంగా ఉండాలని అందరికీ ఎక్కువ కోరిక ఉంటుంది. ముఖ సౌందర్యం కోసం అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఫేస్ క్రీములు, ఫౌండేషన్స్ వాడుతుంటారు.

PREV
19
మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే పాటించాల్సిన 7 చిట్కాలు ఇవే!

ఈ రోజుల్లో అందంగా ఉండాలని అందరికీ ఎక్కువ కోరిక ఉంటుంది. ముఖ సౌందర్యం కోసం అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఫేస్ క్రీములు, ఫౌండేషన్స్ వాడుతుంటారు. ఇలాంటి వాటి వలన చర్మం యొక్క సహజ సిద్ధమైన సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.       
 

29
skin care

చాలా మంది చర్మం ముడతలు పడడం, నల్ల మచ్చలు, రంధ్రాలు, జిడ్డు ముఖం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం అందమైన సహజ సౌందర్యం కోసం మనం కొన్ని ఇంటి చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.                                                       

39
skin care

శెనగపిండి మరియు నిమ్మరసం: మూడు స్పూన్ల శనగపిండి, నిమ్మరసం తీసుకుని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయుట వలన మెరిసే ముఖం మన సొంతం అవుతుంది.           

49
skin care

బాదం మరియు పాలు: నానబెట్టిన బాదం పలుకులను పచ్చిపాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజు గంట సేపు ఉంచుకోవాలి. రాత్రి పూట ముఖానికి అప్లై చేసి  పడుకుంటే మంచిది. ముఖం యొక్క కాంతిని పెంచుతుంది.            

59
skin care

నిమ్మరసం మరియు తులసి ఆకులు: నిమ్మరసం, తులసి ఆకుల రసాన్ని సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇవి చర్మానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. 

69

skin care

కలబంద మరియు నిమ్మరసం: కలబంద గుజ్జును కొద్దిపాటి నిమ్మరసాన్ని తీసుకొని పేస్టులా చేసుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.  జిడ్డు, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి.                                      

79

skin care

పాలు మరియు పసుపు: పాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. ఈ పాలను ఫ్రిజ్ లో ఉంచాలి. నానబెట్టిన దూది పింజలను రోజూ ఒకటి తీసుకుని కమిలిపోయిన చర్మంపైన రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.                                               

89

skin care

బొప్పాయి మరియు తేనె: బొప్పాయి సహజమైన సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. బొప్పాయి పేస్టు తీసుకుని ఇందులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీని వలన ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.                             

99

skin care

టమోటా మరియు చక్కర: తాజా టమోటా రసం, చక్కెర మీ ముఖాన్ని తెల్లగా చేయుటలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. టమోటా, చక్కెర బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని సమర్థవంతంగా తేలికపరుస్తాయి. కాబట్టి ఈ పదార్థాలతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది.

click me!

Recommended Stories