ఆధునిక జీవనశైలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల ప్రభావం, ఆన్లైన్ చదువుల వ్యవహారం. మొత్తం దాని ప్రభావం అంతా మన కంటి మీదే పడుతుంది. దానికి తోడు ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం మన కంటి చూపు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇలాంటి కొన్ని కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
నిరంతరం లాప్టాప్ లు స్మార్ట్ ఫోన్లు చూడటం వలన కళ్ళు పొడిబారి పోవడం జరుగుతుంది. దీనికోసం ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచి కనురెప్పల మీద పెట్టి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిదానంగా కంటి లోపల కూడా శుభ్రం చేయాలి.
ఈ విధంగా చేయడం వలన కంటి లోపల ఉన్న దుమ్ము, ధూళి అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా కంటిలో నీటి ఉత్పత్తి పెరిగి పొడిబారడం తగ్గుతుంది. అలాగే అలోవెరా జెల్ ని కళ్ళను మూసి కనురెప్పలపై రాసి 15 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలోవెరా లో ఉండే ఇన్ఫ్లోమేటరి లక్షణాల వలన కంటిలో దురద, మంట వంటివి తగ్గుతాయి. అలాగే బంగాళదుంపలను గాని, కీరాలను కానీ చక్రాలుగా కోసి వాటిని కంటిమీద పెట్టుకోవటం వలన కూడా కళ్ళకి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా ఫ్యాటీ త్రీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా దొరుకుతాయి. అంతేకాకుండా మనం కూడా కంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కంటికి సరియైన విశ్రాంతిని ఇవ్వాలి. ఎంత వీలైతే అంత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహారం తీసుకోవడం వలన కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.