ఉప్పుతో పొట్ట క్యాన్సర్ - సంచలన అధ్యయనం

First Published | Nov 13, 2024, 10:35 AM IST

మనం తినే ఆహార పదార్థాల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందట. దీన్ని ఎక్కువగా తింటే ప్రాణాంతక వ్యాధుల బారిన పడతామని పలు పరిశోదనలు చెబుతున్నారు. తాజాగా మరో ప్రాణాంతక వ్యాధికి ఈ ఉప్పు కారణమని తేలింది. 

Health Risks of Salt

తినే ఆహారంలో ఉప్పు లేకుంటే అసలు రుచే వుండదు. నోటికి రుచి తగలాలంటే ఆహారంలో సమపాళ్లలో ఉప్పు వుండాల్సిందే. ఇలా ప్రతిరోజు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు తప్పనిసరి. అయితే ఈ ఉప్పే మన ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతోందట.

ఇంతకాలం ఉప్పు బ్లడ్ ప్రెషర్ కు కారణం అవుతుందని తెలుసు... కానీ దీనివల్ల ప్రాణాంతక పొట్ట క్యాన్సర్ వస్తుందని పలు పరిశోదనలు బైటపెట్టాయి. దీంతో రుచికోసం ఉపయోగించే ఉప్పు ఎంత ప్రమాదకమో తెలుసుకుని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Health Risks of Salt

యూకే పరిశోధన ఏం చెబుతుందంటే : 

యునైటెడ్ కింగ్డమ్ లో చేపట్టిన ఓ పరిశోధన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు ఉప్పు ప్రధాన కారణంగా తేలింది. మొత్తం 4,71,144 మంది అహార అలవాట్లను పరిశీలించగా...వీరిలో ఉప్పును ఎక్కువగా తినే వారు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. రుచి కోసం ఆహారంలో ఎక్కువగా సాల్ట్ వాడటం ఎంత ప్రమాదకరమే ఈ పరిశోదన బైటపెట్టింది. 

 గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు ఉప్పుతో సంబంధం వుందని అర్థమవుతోంది... అయితే ఏ స్థాయిలో ఉపయోగిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు వున్నాయన్నదానిపై ఇంకా పరిశోదనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూకేలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ పరిశోధన చెప్పటినట్లు వెల్లడించారు.  

10.9 సంవత్సరాల స్టడీ సమయంలో    మొత్తం 640 గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులను పరిశోధకులు గుర్తించారు.గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు అనేక కారణాలు వున్నాయి...అందులో ఉప్పు ఒకటని తేలినట్లు వెల్లడించారు. అయితే కేవలం ఉప్పు తినడంవల్లే ఈ క్యాన్సర్ వస్తుందని తాము చెప్పడంలేదని పరిశోధకులు వెల్లడించారు. 
 

Latest Videos


Health Risks of Salt

ఆహారంలో ఉప్పు వేసే అలవాటు ఎందుకు మార్చుకోవాలి?

ఆహారంలో ఉప్పు వేయడం ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అధికంగా ఉప్పు వినియోగించడం రక్తపోటును పెంచుతుంది, ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యల ముప్పు పెంచుతుంది. అంతేకాక చాలా ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఎక్కువ సోడియం ఉంటుంది... కాబట్టి పరిమితికి మించి వీటిని వాడకుండా వుంటే మంచిది. 

ఉప్పును తగ్గించడం ఆరోగ్యానికి మేలు చేసే ప్రక్రియ మాత్రమే కాదు, దీని వల్ల రుచుల పట్ల మన అభిరుచులు కూడా క్రమంగా మారతాయి. ఉప్పు తీసుకునే పరిమాణాన్ని తగ్గించడం వలన మనం ఆహారంలోని సహజ రుచులను ఆనందించగలుగుతాము. ఉప్పుగా ఉన్న ఆహారాల పట్ల ఆకర్షణ కూడా తగ్గుతుంది. అదనంగా ఉప్పు వేసే బదులు పచ్చిమిరప, మిరియాలు, నిమ్మరసం లేదా వెనిగర్ వంటివి వాడటం రుచి కోసం మరింత ఆరోగ్యకరమైన మార్గాలు.

ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారికి ఉప్పు నియంత్రణ మరింత అవసరం. ఉప్పు తగ్గించుకునే అలవాట్లు అలవరుచుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాధారణమైన మార్గం. దీనివల్ల మందులపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీవనశైలిలో చిన్న మార్పులు అనుకున్నదానికంటే గొప్ప ఫలితాలు ఇవ్వగలవు. కాబట్టి తినే ఆహారంలో ఉప్పు వేసే బదులు ఇతర పద్దతుల్లో రుచిని పెంచుకోండి...ఇది  దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడే కీలక అడుగు అవుతుంది.
 

Health Risks of Salt

ఇంకా ఏయే ఆహార పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు వుంటాయో తెలుసా? 

మనం రోజూ తీసుకునే అహారం, చిరుతిళ్లలోనూ క్యాన్సర్ కారకాలు వున్నాయి. మనం రోజూ పాలు ఎక్కువగా తాగడంవల్ల ఆరోగ్యం బాగుంటుందని భావిస్తాం. కానీ కొన్ని అధ్యయనాలు పాలను ఎక్కువగా తీసుకోవడం వలన పురుషుల్లో ప్రొస్థెట్ క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతున్నాయి. పాలు తాగడంవల్ల ఐజిఎఫ్-1 పెరిగి క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంటుందట.

కేవలం మంటపై కాల్చే స్మోక్డ్ ఫుడ్స్ వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం వుంటుందట.  వీటిలో పాలిసిలిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెటిరోసైక్లిక్ అమైన్స్ వుంటాయట.వీటివల్ల క్యాన్సర్ ప్రమాదం వుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

ఇక తెలుగువాళ్లు ఎక్కువగా ఉపయోగించే పచ్చళ్లు కూడా క్యాన్సర్ కు కారణం అవుతున్నయట.వీటివల్ల జీర్ణాశయ క్యాన్సర్ ప్రమాదం వుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా చాలా అహార పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లకు కారణం అవుతున్నాయట...కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం ఏదో తెలుసుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!