నెల రోజుల పాటు పప్పులు తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా?

First Published May 22, 2024, 11:53 AM IST

కందిపప్పు, పెసర పప్పు, శెనగపప్పు మొదలైన పప్పుల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది వారంలో రెండు మూడు రోజులు పప్పు చారునే తింటుంటారు. అయితే ఒక వ్యక్తి నెల రోజుల పాటు పప్పు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?


భారతీయులకు ఇష్టమైన ఆహారాల్లో పప్పు ఒకటి. చాలా మందికి దాల్ రైస్, దాల్ రోటీ అంటే చాలా ఇష్టం. ఇది చాలా హెల్తీ ఫుడ్. ముఖ్యంగా పప్పులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. పప్పుతో  ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పప్పును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలందరికీ తెలుసు. మరి అదే పప్పును ఒక నెల పాటు తినకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

శాకాహారులకు పౌష్టికాహారం పప్పు ధాన్యాలేనంటారు ఆరోగ్య నిపుణులు. పప్పుధాన్యాలను తినకుంటే మన రోజువారి ప్రోటీన్ అవసరం తీరదు. పప్పును తినకపోదే మీ కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా మాంసాహారం తిననివారు. అలాగే ప్రోటీన్ కోసం వెజ్ ఆహారంపై పూర్తిగా ఆధారపడే వ్యక్తులకు కూడా ఇది చాలా చాలా అవసరం. అందుకే మీరు ఒక నెల పాటు పప్పులను తినకపోతే మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. 
 

అలాగే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి మీరు కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఇది మీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే కాయధాన్యాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది.
 

పప్పుల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. కాయధాన్యాలు తినకపోవడం వల్ల మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడుతుంది. అలాగే ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించడంతో పాటుగా మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 
 

ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకే మీ రోజువారి ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డాక్టర్ తో ఖచ్చితంగా మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్లు ప్రతిరోజూ 1/2 లేదా 3/4 వండిన కాయధాన్యాలు తినాలని సిఫార్సు చేస్తారు. ఒకవేళ మీరు పప్పును తినకూడదనుకుంటే ప్రోటీన్, ఫైబర్ ఉండే ఇతర ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

click me!