ఉదయం లేవగానే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? అస‌లు విష‌యం ఇది.. !

First Published | May 10, 2024, 1:48 PM IST

health - water : మారుతున్న కాలం, బీజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యం పై జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా ముఖ్యం.  మ‌న పెద్ద‌లు ఉద‌యం లేవ‌గానే నీళ్లు తాగాల‌నీ, ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంద‌ని చెబుతుంటారు. అయితే, ఉద‌యం లేవ‌గానే నీళ్లు తాగ‌డం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? 
 

health tips: ఉదయాన్నే నిద్రలేవడం, ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం చాలా ఆరోగ్యకరమైనదిగా అంద‌రూ భావిస్తారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం.. ఉద‌యాన్ని నీళ్లు తాగ‌డం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా? అనే విష‌యాలు నిపుణులు వివ‌రించారు. 

ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఈ అలవాట్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఆరోగ్యం విష‌యంలో అంద‌రికీ ఒకేర‌క‌మైన ఆల‌వాట్లు ప్రయోజ‌నాలు అందించ‌వ‌నీ, వైద్య నిపుణుల స‌ల‌హాల‌తో మీకు ఎలాంటి ఆరోగ్య సూత్రాలే మేలు చేస్తాయ‌ని తెలుసుకోవాల‌ని సూచిస్తున్నారు. 
 

Latest Videos


ఇక ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం, ఇది నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా?  లేదా అనే విషయాన్ని వివ‌రించారు డాక్టర్ నితికా కోహ్లీ. ఆయుర్వేదంలో ఎండీగా ఉన్న వీరికి ఈ రంగంలో 17 ఏళ్ల అనుభవం ఉంది.

ఉద‌యాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.  అయితే, దీనిని మీరు ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచి నీరు తాగడం ఆయుర్వేదంలో 'ఉషాపాన్' అని పిలుస్తారనీ, ఇందుకు సరైన సమయం కూడా వివ‌రించార‌ని తెలిపారు. 
 

ఆయుర్వేదం ప్రకారం, ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి సరైన సమయం బ్రహ్మ ముహూర్తంగా చెప్పారు. ఉదయాన్నే నిద్రలేచి, సూర్యుడు బయటకు రాకముందే నిద్రలేవాల్సిన సమయం వస్తే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంద‌న్నారు. సూర్యోదయం తర్వాత లేదా ఆలస్యంగా 2-3 గంటల తర్వాత నిద్రలేవడం వారికి అంత ప్రయోజనకరంగా ఉండదని చెప్పారు. 
 

water

మీరు ఉదయం ఎంత నీరు త్రాగాలి అనేది మీరు మేల్కొనే సమయం, గ్యాస్ట్రైటిస్ మీద ఆధారపడి ఉంటుంద‌న్నారు. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యంగా ఉండటానికి జీర్ణశక్తి చాలా ముఖ్యం. దీని కోసం సరైన సమయంలో నీళ్లు తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే, స‌మయాలు పాటించ‌కుండా ఎప్పుడుప‌డితే అప్పుడు నీరు త్రాగటం కూడా హానిని క‌లుగ‌జేస్తుంది. 


మీరు ఉదయాన్నే కుంకుమపువ్వు లేదా మరేదైనా హెర్బ్ తాగాలా, ఇంఫ్యూజ్డ్ వాటర్ తాగాలా లేదా గోరువెచ్చని నీరు త్రాగాలా అనేది మీ ఆరోగ్య పరిస్థితి, శరీర స్వభావంపై ఆధారపడి ఉంటుందని వివ‌రించారు. కాబ‌ట్టి ఉద‌యాన్నే నీరు తాగ‌డం లేదా ఇత‌ర ద్ర‌వాలు తీసుకోవ‌డ‌మ‌నే అంశంలో ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన సలహా ఇవ్వలేమన్నారు. దీనితో పాటు, మీరు ఉదయం ఎక్కువ నీరు త్రాగాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్యం కోసం 1 గ్లాసు నీళ్లు తాగితే సరిపోతుంద‌న్నారు.
 

click me!