రాత్రి పూట నిద్రపోవడానికి ముందు గ్లాస్ గోరువెచ్చని పాలను తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. ఇలా పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి ముందు పాలను తాగడం వల్ల సానుకూల ప్రభావాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు కూడా కనుగొన్నాయి.
రాత్రిపూట పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పాలు, ఇతర పాల ఉత్పత్తుల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అమైనో ఆమ్లం. ట్రిప్టోఫాన్ శరీరంలో మెలటోనిన్, సెరోటోనిన్ రెండింటి సంశ్లేషణకు పనిచేస్తుంది. మెలటోనిన్ ను 'స్లీప్ హార్మోన్' అని కూడా అంటారు. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇకపోతే సెరోటోనిన్ బహుముఖ న్యూరోట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆకలి నియంత్రణ, నిద్ర మాడ్యులేషన్, నొప్పిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ట్రిప్టోఫాన్ నిద్ర నియంత్రణకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు విటమిన్ బి 3 కాంప్లెక్స్ భాగమైన నియాసిన్ ను రూపొందించడానికి మీ కాలేయం అమైనో ఆమ్లాన్ని కూడా ఉపయోగిస్తుంది. నియాసిన్ శక్తి, జీవక్రియ, డీఎన్ఎ సంశ్లేషణకు సహాయపడుతుంది. అవసరమైన శారీరక విధులను పెంచుతుంది.
బిఎంసి జెరియాట్రిక్స్ పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. పాలు లేదా పాల ఉత్పత్తుల వినియోగం వృద్ధులలో నిద్రను మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. గోరువెచ్చని పాలను తాగడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ పనిచేయకపోవచ్చంటున్నారు నిపుణులు. నిద్రకు ముందు పాలు తాగే సమయం, పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆహార ప్రాధాన్యతలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
Image: pexel
రాత్రిపూట పాలు తాగితే బరువు పెరిగితే బరువు పెరుగుతారా?
మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రిపూట పాలు తాగడం మంచిది. కానీ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఇది అంత మంచిది కాకపోవచ్చు. నిపుణుల ప్రకారం.. రాత్రిపూట పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రక్రియ మీ శరీరం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. ఇది మీ బరువును పెంచుతుంది.
Image: Freepik
రాత్రిపూట పాలను తాగడం వల్ల పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ ను రిలీజ్ చేస్తాయి. ఇది మీ శరీరం సిర్కాడియన్ లయకు అంతరాయం కలిగిస్తుంది. అందుకే ఇలాంటి సమస్యను నివారించడానికి పాలను మోతాదులో తాగడం చాలా ముఖ్యం.
milk
ఆడవారు ఏదైనా హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటుంటే రాత్రిపూట పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటున్న మహిళలకు పాల ఉత్పత్తులను ఖచ్చితంగా మానేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కాకపోతే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా పిసిఒఎస్ లేదా పిసిఒడి ఉన్నవారిలో.
badam milk
పాలలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్తో సహా వివిధ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉన్నాయని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. ఇవి సమస్యను పెంచుతాయి. పాలు, పాల ఉత్పత్తులను వాటి పోషక విలువలను ఆస్వాదించడానికి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ మితంగా తాగాలి.