ఈ వయసున్న పిల్లలకు ఆవు పాలను అసలే తాగించకూడదు.. లేదనుకో..!

Published : Sep 03, 2023, 07:15 AM IST

ఆవు పాలను తాగడం వల్ల నమ శరీరానికి బలం చేకూరుతుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. నిజానికి ఆవుపాటు ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన బిడ్డకు ఆవు పాలను తాగించకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే? 

PREV
16
ఈ వయసున్న పిల్లలకు ఆవు పాలను అసలే తాగించకూడదు.. లేదనుకో..!

పూర్వకాలంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆవు పాలను తాగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక సంవత్సరం కంటే తక్కువ వయసన్న పిల్లలకు ఆవు పాలను తాగించకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆవు పాలకు బదులుగా పిల్లలకు ఫార్ములా పాలను ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

26

ఫార్ములా పాలు కూడా ఆవు పాల నుంచి తయారైనప్పటికీ.. ఇది శిశువు జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఆవు పాలను తాగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

36
donkey milk


ఏడాది ఉన్న చిన్నారులకు ఎందుకు ఆవు పాలను తాగించకూడదంటే? 

ఈ సమయంలో శిశువు జీర్ణవ్యవస్థ పెళుసుగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య నిపుణులు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డకు ఆవు పాలను తాగించకూడదని చెప్తుంటారు. ఎందుకంటే ఈ వయసు పిల్లలకు ఆవు పాలను తాగించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. నిజానికి ఆవు పాలలో ఎక్కువ మొత్తంలో సోడియం, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. వీటిని మీ బిడ్డకు జీర్ణించుకోవడం కష్టం.
 

46

అలాగే శిశువుకు ప్రారంభ అభివృద్ధి సమయంలో ఇనుము, విటమిన్ -ఇ, కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. ఇవి పాలలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. అందుకే బిడ్డ పెరుగుదలకు ఆవు పాలను తీసుకోమని డాక్టర్లు చెప్పరు. ఆవు పాలలో ఐరన్ లోపించడం వల్ల చాలాసార్లు పిల్లల్లో రక్తహీనత సమస్య కూడా వస్తుంది.
 

56

ఆవు పాలను ఎప్పటి నుంచి తాగాలి? 

బిడ్డకు ఏడాది వయసు వచ్చాక ఆవు పాలను తాగించొచ్చు. ఈ సమయంలో వీరికి పూర్తి కొవ్వు పాలను ఇవ్వొచ్చు. అయితే బిడ్డకు రోజుకు 400 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

66

ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలు

ఆవు పాలను బిడ్డకు తాగించడం వల్ల కాల్షియం లోపం తొలగిపోతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఆవు పాలలో ఉండే క్యాల్షియం పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.

ఆవు పాలలో ఉండే ప్రోటీన్, కొవ్వు వంటి పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఎంతో అవసరపడుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories