
మారుతున్న జీవనశైలితో నేటి యువత ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తోంది. నిశ్చల అలవాట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినడం వంటి అలవాట్ల వల్ల ఊబకాయంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అకాడమిక్ ఒత్తిడి, డిజిటల్ కల్చర్ కారణంగా యువతలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యలు వారి మొత్తం శ్రేయస్సు, భవిష్యత్తు ఆరోగ్యంపై ఎంతో ప్రభావాలను చూపుతాయి. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతను ప్రభావితం చేసే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక ఆరోగ్య సమస్యలు
యువతలో రోజు రోజుకు మానసిక ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. చదువులో ముందుండటానినకి, సామాజిక సంబంధాలను నిర్వహించడానికి, వ్యక్తిగత మార్పులను నావిగేట్ చేయడం వంటి వాటివల్ల యువతలో ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఎన్నో శారీరక సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.
అనారోగ్యకరమైన జీవనశైలి
నిశ్చల జీవనశైలి, కేలరీలను ఎక్కువగా తీసుకోవడం, పోషకాల తక్కువున్న ఆహారాలకు తినడం వల్ల యువత సులువుగా ఊబకాయం బారిన పడుతున్నారు. అంతేకాదు ఇది హృదయ సంబంధ సమస్యలు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఇది డయాబెటిస్, గుండె సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాకుండా యుక్తవయస్సులో ఈ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శారీరక కార్యకలాపాలల్లో పాల్గొనడం, సమతుల్య ఆహారాలను తినడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వంటి అలవాట్లు ఈ అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం
కౌమారదశలోనే మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ ను అలవాటు చేసుకుంటారు కొంతమంది పిల్లలు. మాదకద్రవ్యాల వాడటం.. వ్యసనం, బలహీనమైన అభిజ్ఞా పనితీరు, దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే యువతకు వీటి దుష్ప్రభావాల గురించి ముందుగానే అవగాహన కల్పించాలి.
లైంగిక ఆరోగ్య సమస్యలు
సరైన సెక్స్ ఎడ్యుకేషన్, సురక్షితమైన సెక్స్ పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల అవాంఛిత గర్భాలు, లైంగిక సంక్రమణ అంటువ్యాధుల వ్యాప్తి, యువతలో సంబంధాల సమస్యలకు దారితీస్తుంది. ఎస్టీడీలు, అవాంచిత గర్భాల వ్యాప్తిని నిరోధించడానికి బాధ్యతాయుతమైన నిర్ణయాలను తీసుకోవడం ప్రోత్సహించడంతో పాటుగా ఖచ్చితమైన సమాచారం అవసరం.
స్మార్ట్ ఫోన్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం వల్ల నిద్ర విధానాలకు భంగం కలుగుతుంది. ఇది కంటి ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే మనుషులకు మనుషుకు మాటలు కూడా తగ్గుతాయి. ఇది మిమ్మల్ని సమాజానికి దూరం చేస్తుంది. అంతేకాదు నిద్రలేమి, అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి,మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి డిజిటల్ వస్తువుల వాడకాన్ని తగ్గించేలలా చూడాలి. వారితో ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నించాలి.
ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసే చిట్కాలు
యవ్వనంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య పోషకాహారం, రెగ్యులర్ వ్యాయామం, తగినంత నిద్రకు ప్రాధాన్యతనివ్వండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలను తగ్గించండి.
హైడ్రేటెడ్ గా ఉండండి. ధ్యానం లేదా అభిరుచులు వంటి కార్యకలాపాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
స్మోకింగ్, ఆల్కహాల్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూస్తున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోండి. అలాగే విశ్రాంతి తీసుకోండి.
గేమ్స్, డ్యాన్స్ లేదా వాకింగ్ వంటి మీరు ఆనందించే వాటిలో క్రమం తప్పకుండా పాల్గొనండి. శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఎస్టీఐలను నివారించడానికి సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.