పిల్లలలో గుండె ఆగిపోవడానికి కారణం ఏమిటి? : కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటాయి. వారి గుండె నిర్మాణంలోనే అసాధారణతలు ఉన్నాయి. వారిలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. అలాంటి పిల్లలకు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నవజాత శిశువులు, చిన్న పిల్లలకు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. ఇటువంటి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు, గుండెపై ఒత్తిడి కూడా కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.