ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హైపర్ టెన్షన్ సమస్య తో బాధపడుతున్నారు. దీనినే హై బీపీ అని కూడా అంటారు. అయితే, దీని వల్ల గుండె జబ్బులు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం మనకు ఎన్నో రకాల మందులు, మంచి ఆహారాలు ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని యోగాసనాలతో ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ యోగాసాలేంటో ఓసారి చూద్దామా..