ఆలుగడ్డలను సరిగ్గా ఉడికించి తింటే ఎన్ని లాభాలో..!

Published : Jun 20, 2023, 04:09 PM IST

సాధారణంగా బంగాళదుంపలు బరువు పెరిగేలా చేస్తాయంటారు చాలా మంది. కానీ ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిని సరిగ్గా ఉడికించి తింటే బోలెడు లాభాలను పొందుతారు తెలుసా..   

PREV
18
ఆలుగడ్డలను సరిగ్గా ఉడికించి తింటే ఎన్ని లాభాలో..!
Image: FreePik

బంగాళాదుంపలు సాధారణంగా మంచి పోషకాహారం. వీటిని ఎన్నో విధాలుగా వండి తినొచ్చు. ఈ కూరగాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీన్ని ఫిల్టర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తింటే కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బంగాళాదుంపల్లో కొవ్వు  అసలే ఉండదు. కొలెస్ట్రాల్ కూడా ఉండదు. సోడియం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్దతిలో వండిన బంగాళాదుంపలు రుచికరమైనవిగా, పోషకమైనవిగా, ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. బంగాళాదుంపలను వండడానికి సరైన మార్గాన్ని తెలుసుకునే ముందు బంగాళాదుంపల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

28
potato

బరువు తగ్గడానికి..

హార్వర్డ్ హెల్త్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. బంగాళాదుంపలు బరువును పెంచుతాయని అనుకుంటారు. ఆలుగడ్డలు ఫైబర్ కు మంచి మూలం. కాబట్టి ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. బంగాళాదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. అలాగే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది శరీరం నుంచి విటమిన్లను గ్రహించడానికి కూడా సహాయపడుతుంది.
 

38
potato

జీర్ణ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది 

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. బంగాళాదుంపలలో ఉండే ఫైబర్ ను రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. ఇది కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండింటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది ఇతర రకాల ఫైబర్ కంటే తక్కువ వాయువును కలిగిస్తుంది. బంగాళాదుంపలలో రెసిస్టెంట్ స్టార్చ్ ను.. ఒక రోజు ముందుగా వండడం, రాత్రంతా ఫ్రిజ్లో గడ్డకట్టించడం ద్వారా పెంచొచ్చు. వీటిని తినడానికి ముందు మళ్లీ వేడి చేయొచ్చు. కరిగే ఫైబర్ వంటి రెసిస్టెంట్ స్టార్చ్, పెద్ద ప్రేగులోని మంచి బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. కరగని ఫైబర్ మాదిరిగా ఇది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ను నివారిస్తుంది. 
 

48
Image: Getty Images

గుండె ఆరోగ్యం కోసం.. 

న్యూట్రియంట్ జర్నల్ ప్రకారం.. బంగాళాదుంపలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే సమ్మేళనాలు. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

58

అధిక రక్తపోటును తగ్గిస్తుంది 

వండిన బంగాళాదుంపల పొట్టులో  పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మనం తినే ఆహారంలో తగినంత పొటాషియం లేకుంటే శరీరం అదనపు సోడియంను నిలుపుకుంటుంది. సోడియం ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం రక్తపోటును తగ్గించడానికి, గుండెను రక్షించడానికి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

68

బంగాళాదుంపలను ఎలా తినాలి

బంగాళాదుంపలను తొక్కలతో కలిపి తినాలి. ఎందుకంటే తొక్కలో గుజ్జు కంటే 12 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టు తీయని బంగాళాదుంప విటమిన్ సి సిఫార్సు చేసిన రోజువారీ విలువలో 40% కంటే ఎక్కువ ఉంటుంది. రోజుకు అవసరమైన విటమిన్ బి6లో సగం బంగాళాదుంపల్లోనే ఉంటుంది. ఇందులో అరటి పండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, మెగ్నీషియం,  ఫోలేట్ కు మూలం.
 

78

 బంగాళాదుంపలను ఎలా ఉడికించాలి?

న్యూట్రియంట్ జర్నల్ ప్రకారం.. వండడానికి ముందు బంగాళాదుంపలను ఎప్పుడూ కూడా బాగా కడగాలి. రుచి, ఫైబర్ కోసం తొక్కను తీయకూడదు. 
బంగాళాదుంపలను మంటల్లో కాల్చి లేదా వేయించి తినొచ్చు. 
ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఇష్టమైన మూలికలు లేదా మసాలా దినుసులతో ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినొచ్చు.

88

జాగ్రత్త 

న్యూట్రీషియన్ జర్నల్ ప్రకారం.. ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్ లో.. సరిగ్గా వండిన బంగాళాదుంపల కంటే నాలుగు రెట్లు ఎక్కువ కేలరీలు, 23 గ్రాముల ఎక్కువ కొవ్వు ఉంటాయి. వీటిని సాధారణంగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. బంగాళాదుంపలను వేయించడం, ఉడకబెట్టడం, వండటం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories