పుదీనా ఆకులే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటితో బోలెడు లాభాలున్నాయి మరి

Published : Jun 21, 2023, 07:15 AM IST

పుదీనా వాటర్ మలబద్దకాన్ని నివారించడానికి, మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ మనల్ని రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అంతేకాదు   

PREV
14
పుదీనా ఆకులే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటితో బోలెడు లాభాలున్నాయి మరి

mint leaves

పుదీనాలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులు మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అలాగే కంటిచూపును పెంచుతుంది. పుదీనా ఆకులలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, భాస్వరం, విటమిన్ సి, ఐరన్, ఫైబర్ లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

24

పుదీనా ఆకుల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సుమారు 25 గ్రాముల ఆకుల్లో కేవలం 4 కేలరీలు మాత్రమే ఉంటాయి. పుదీనా ఆకులు తక్కువ మొత్తంలో కొవ్వును, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. అంతేకాదు దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. 25 గ్రాముల పుదీనా ఆకుల్లో సాధారణంగా 1 గ్రాము కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. పుదీనా ఆకుల్లో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్లో మెంతోల్ ఎసెన్స్ ఉంటుంది. ఇది గొంతునొప్పిని తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

34

mint leaves

పుదీనా నీరు మలబద్దకాన్ని నివారించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అంతేకాదు పుదీనా మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట పుదీనా టీ  లేదా పుదీనా నీటిని తాగితే ప్రశాంతంగా నిద్రపోతారు.

44

mint drinks

పుదీనా ఆకుల్లో ఫాస్పరస్, కాల్షియంతో పాటుగా శరీర రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ ఎ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కణాలకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షిస్తుంది. దీంతో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

click me!

Recommended Stories