కేలరీలను బర్న్ చేయడానికి, ముఖ కండరాలను టోన్ చేయడానికి సహాయపడుతుంది
ముద్దు వ్యాయామంతో సమానం కానప్పటికీ.. ముద్దు నిమిషానికి 2-3 కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. దీంతో హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే మీ శరీరంలో ఆక్సిజన్ ప్రవహించే రేటును కూడా పెంచుతుంది. ముద్దు 3 నుంచి 35 ముఖ కండరాలను నిమగ్నం చేస్తుంది. ఇది మీ ముఖానికి బలమైన వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది మీ ముఖ కండరాలను టోనింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ ముఖం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.