మామిడి ఆకు ఆరోగ్య ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మామిడి ఆకులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటువ్యాధులు దరిచేరవు.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మామిడి ఆకులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
3. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది
షుగర్ వ్యాధిగ్రస్తులకుమామిడి ఆకు వరం లాంటిది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో మా ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. మా ఆకు పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.